English | Telugu
నందమూరి అభిమానులకు న్యూఇయర్ గిఫ్ట్
Updated : Dec 17, 2014
‘లెజెండ్’ వంటి భారీ సక్సెస్ తర్వాత సత్యదేవ్ దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న సినిమాపై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఇప్పటికే సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావచ్చింది. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి లేదా మార్చిల్లో విడుదల చేసే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. ఇక ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ టీజర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. డిసెంబర్ 31 అర్థరాత్రి 12 గంటలకు కొత్త సంవత్సర కానుకగా నందమూరి అభిమానుల కోసం యూట్యూబ్‌లో టీజర్‌ను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. సో.. కొత్త సంవత్సర కానుకగా బాలయ్య అభిమానులకు మంచి గిఫ్ట్ ఇవ్వబోతున్నడమాట..! మరీ న్యూయర్ గిఫ్ట్ ఎలా ఉండబోతుందనే ఆసక్తితో అభిమానులు వేచి చూస్తున్నారు.