English | Telugu

బ‌న్నీ స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్‌?

వెండి తెర‌పై వ‌రుణ్ తేజ్ రూపంలో మ‌రో మెగా హీరో రాబోతున్నాడు. ముకుంద ఈ నెల 24న వ‌స్తోంది. మెగా హీరో సినిమా, అందులోనూ శ్రీ‌కాంత్ అడ్డాల డైరెక్ష‌న్‌, దానికి తోడు ఠాగూర్ మ‌ధు తీస్తున్న సినిమా... వీట‌న్నింటి మ‌ధ్య రిలీజ్ అవుతున్న ముకుందపై మంచి అంచ‌నాలే ఉన్నాయి. అయితే మెగా ఫ్యాన్స్ ని ఊరించ‌డానికి, వాళ్ల‌ని థియేట‌ర్ల వైపు రప్పించ‌డానికి చిత్ర బృందం ఓ స‌ర్ ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేస్తోంది. అందేంటంటే.. ఈసినిమాలో బ‌న్నీ కూడా ఉన్నాడ‌ట‌. ఓ పాట‌లో అలా మెరిసి, ఇలా మాయ‌మ‌వుతాడట‌. ముందు ఓ కేమియో రోల్ చ‌ర‌ణ్ తో చేయించాల‌నుకొన్నారు. అయితే చ‌ర‌ణ్ అందుబాటులో లేక‌పోవ‌డంతో బ‌న్నీని సంప్ర‌దించారు. బ‌న్నీ ఒకే అన‌డంతో.. ముకుందలో బ‌న్నీ ఎంట్రీ ఖాయ‌మైంద‌ని టాక్‌. అంతేకాదు.. ఓ పాట‌లో శ్రీ‌కాంత్ అడ్డాల కూడా క‌నిపిస్తాడ‌ట‌. మొత్తానికి ముకుంద‌లో ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యాలు చాలానే ఉన్నాయ్‌

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.