English | Telugu
హరికృష్ణను ఓదార్చిన బాలయ్య
Updated : Dec 7, 2014
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నందమూరి జానకిరామ్ బౌతికకాయన్ని నందమూరి బాలకృష్ణ సందర్శించి నివాళులర్పించారు. ఆదివారం ఆయన సతీమణి వసుంధరతో కలిసి హరికృష్ణ ఇంటికి చేరుకున్న బాలయ్య అన్నను దగ్గరకు తీసుకుని ఓదార్చారు. అనంతరం జానకీరామ్ మృతదేహానికి నివాళులు అర్పించారు. జానకిరామ్ బౌతికకాయన్ని చూసి తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు.
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నందమూరి జానకిరామ్‌కు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. సినీ నిర్మాత దగ్గుపాటి సురేష్, దర్శకుడు రాఘవేంద్ర, ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీప్రణీత, లక్ష్మీపార్వతి, పరుచూరి వెంకటేశ్వరరావు తదితరులు జానకిరామ్‌కు పూలమాల వేసి నివాళులర్పించారు.