English | Telugu
లయన్ ఫస్ట్ డే కలెక్షన్స్
Updated : May 15, 2015
లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత బాలయ్య నుంచి వచ్చిన లయన్ కు మంచి ఓపెనింగ్స్ దక్కాయట. తొలి రోజే ఈ సినిమా అయిదున్నర కోట్లు రాబట్టినట్లు సమాచారం. నైజాంలో కోటిన్నర, వైజాగ్, కృష్ణా, ఈస్ట్, వెస్ట్, గుంటూరు ఒక్కొక్కటి నలభై నుంచి నలభై అయిదు లక్షల మధ్యన షేర్ వచ్చిందట. మిగిలిన ప్రాంతాలు అన్నీ కలిపి కోటిన్నర వరకు వచ్చిందంటున్నారు. తొలిసారి మల్టీ ఫ్లెక్స్ ల్లో కూడా బాలయ్య సినిమాకు తొలి రోజు డిమాండ్ కనిపించడం విశేషం. వేసవి సెలవులు ఇంకా వుండడంతో కలెక్షన్లు డ్రాప్ అయిపోతాయని భయపడాల్సిన పనిలేదని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.