English | Telugu

బాలకృష్ణ తొడకొట్టడా !!!


బాలకృష్ణ సినిమా అంటేనే పంచ్ డైలాగులు, కత్తులు, ఫైట్లు, బాంబులు మాంచి మాస్ ఎలిమెంట్స్ తో కూడుకొని ఉంటుందని ఫిక్స్ అయిపోతారు. అలా పవర్ ఫుల్ టైటిల్స్, క్యారెక్టరైజేషన్ తో వచ్చిన బాలయ్య సినిమాలు బాక్స ఆఫీస్ వద్ద మంచి రికార్డులు సాధించాయి. గతంలో వచ్చి నరసింహ నాయుడు, సింహీ, లేటెస్టుగా వచ్చిన లెజెండ్ సినిమాలు అలాంటి తరహా చిత్రాలే. అయితే ఇకపై బాలకృష్ణ ప్యాక్షన్ సినిమాలకు దూరం కానున్నారట. ఈ ఎన్నికలలో విజయం సాధించి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన బాలయ్య పొలిటికల్ డ్రామా, ఫ్యాక్షన్ తరహా చిత్రాలలో ఇకపై నటించటం లేదట. హిందూపురం నుంచి బాలకృష్ణ ఎంఎల్ఏ గా ఎన్నికయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఈ విషయం తాజాగా మీడియాకు వివరించారు. పొలిటికల్ ఎంట్రీతో ఇలా పొలిటికల్ డ్రామా చిత్రాలకు, ఫ్యాక్షన్ చిత్రాలకు బాలయ్య దూరం అవడం అభిమానులకే కాదు, చాలా మంది దర్శకులను కూడా నిరుత్సాహ పరుస్తోంది. లెజెండ్ హిట్ తో మళ్లీ బాలకృష్ణతో సినిమా తియ్యాలనుకుంటున్న బోయపాటికి ఇది పిడుగు పాటే అని చెప్పాలి.


పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.