English | Telugu
మోహన్‌లాల్ ప్లేస్‌లో వెంకటేష్
Updated : Jun 5, 2014
బంధాలు, బాధ్యతలు, మానవ సంబంధాలు, ఈ విధమైన కథాంశంతో రూపొందుతున్న చిత్రాలు ఈ మధ్య కాలంలో తక్కువే. మధ్య తరగతి అమ్మాయిలు, చదువులు, వీటి మధ్య అబ్బాయిల వల్ల ఎదురయ్యే ఇబ్బందులు... ఆ సమయంలో ఆ ఇంటి వారు ఎదుర్కునే మానసిక, సామాజిక సమస్యలు ఇలాంటి ఒక చక్కటి అంశంతో వస్తున్న చిత్రంలో వెంకటేశ్ ఒక ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు. శ్రీప్రియ దర్శకత్వంలో వచ్చిన దృశ్యమ్ చిత్రం మలయాళంలో గొప్ప విజయం దక్కించుకుంది. ఆ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. మలయాళంలో మోహన్‌లాల్ చేసిన పాత్ర తెలుగు రీమేక్ లో వెంకటేశ్ చేయబోతున్నారు. ఈ చిత్రంలో మీనా, నదియ తదితరులు నటిస్తున్నారు.