English | Telugu

బాలయ్య బర్త్ డేకి

శ్రీ సాయిబాబా మూవీస్ పతాకంపై, వాల్మీకిగా నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు నటిస్తూండగా,నందమూరి నటసింహం, యువరత్న నందమూరి బాలకృష్ణ శ్రీరామచంద్రమూర్తిగా,నయనతార సీతా మహాసాధ్విగా,శ్రీకాంత్ లక్ష్మణుడిగా, సాయికుమార్ భరతుడిగా,బాపు దర్శకత్వంలో,యలమంచిలి సాయిబాబు నిర్మిస్తున్న పౌరాణిక చిత్రం "శ్రీ రామ రాజ్యం".ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, సంభాషణలను ముళ్ళపూడి వెంకట రమణ వ్రాస్తుండగా, ఇళయరాజా సంగీతాన్నందిస్తున్నారు.ఈ చిత్రానికి జొన్నవిత్తుల, వెన్నెలకంటి పాటలూ, పద్యాలూ వ్రాస్తున్నారు.ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం ఆల్వాల్ లో వేసిన కోటి రూపాయల ఆశ్రమం సెట్ లో జరుగుతూంది. ఈ చిత్రాన్ని హీరో బాలకృష్ణ జన్మదినమైన జూన్ 10 వ తేదీన విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.