English | Telugu
ఫిబ్రవరిలో యన్ టి ఆర్ కొత్త చిత్రం
Updated : Jan 28, 2011
యంగ్ టైగర్ యన్ టి ఆర్ నటించబోయే కొత్త చిత్రం ఫిబ్రవరి నెల నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది.ఈ చిత్రంలో యన్ టి ఆర్ సరసన తమన్నా, తాప్సి హీరోయిన్లుగా నటించనున్నారు.ఈ చిత్రానికి "కిక్" ఫేం సురేంద్ర రెడ్డి దర్శకత్వం వహిస్తారు.ఈ చిత్రాన్ని బి.వి.యస్.యన్.ప్రసాద్ నిర్మించనున్నారు.ఈ చిత్రం నవంబర్ లోనే పూజా కార్యక్రమాలు జరుపుకుంది.ఈ చిత్రం పూజ రోజునే పూర్తి బిజినెస్ జరుపుకోవటం తెలుగు సినీ పరిశ్రమను ఆశ్చర్యంలో ముంచెత్తింది.ఈ చిత్రం యొక్క శాటిలైట్ హక్కులను ఒక టి.వి.ఛానల్ వారు నాలుగున్నర కోట్లకు కొన్నారని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి.ఇది యాక్షన్, రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపుదిద్దుకోనుంది.