ప్రముఖసంచలన దర్శక,నిర్మాత రామ్(రాంగ్)గోపాల్ వర్మ సంచలనాత్మకంగా తీస్తున్నానని ప్రకటించిన చిత్రం"దొంగల ముఠా".మాస్ రాజా రవితేజ హీరోగా,ఛార్మి హీరోయిన్ గా,లక్ష్మీ ప్రసన్న, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం,సుబ్బరాజు, బ్రహ్మాజీ, అజయ్ తదితరులు ఈ చిత్రంలో పారితోషికం తీసుకోకుండా నటిస్తున్నారు.అంతే కాకుండా ఈ చిత్రాన్ని కేవలం అయిదు రోజుల్లోనే ఈ సినిమా తీస్తానని వర్మ అన్నాడు.దానికి తగ్గట్టుగానే ఈ చిత్రానికి అయిదుగురు ప్రముఖ దర్శకులు పనిచేస్తున్నారు.రామ్ (రాంగ్) గోపాల వర్మ, కృష్ణ వంశీ, వి.వి.వినాయక్,గుణశేఖర్ ,హరీష్ శంకర్ తదితరులు పనిచేస్తున్నారు.పూరీ జగన్నాథ్ కూడా ఈ చిత్రానికి పనిచేస్తారని తెలిసినా ఎమదుకనో ఆయని చిత్రానికి పనిచేయట్లేదని తెలిసింది.