English | Telugu

రణస్థలంలో తొడకొట్టిన బాలయ్య.. అస్సలు మిస్ కావద్దు!

ఈమధ్య నందమూరి బాలకృష్ణలో జోరు, హుషారు బాగా పెరిగాయి. ఓ పక్క వరస సూపర్‌హిట్‌ సినిమాలతో జోరు కొనసాగిస్తున్న బాలయ్య మరో పక్క రియాలిటీ షోలను హుషారుగా నిర్వహిస్తూ చాలా బిజీ అయిపోయారు. గతంలో కంటే బాలయ్య ఛరిష్మా మరింత పెరిగిందని ఇటీవల ఆయన చేసిన సినిమాలు, రియాలిటీ షోలతో తెలుస్తోంది. అంతేకాకుండా ఈమధ్య కమర్షియల్‌ యాడ్స్‌లో సైతం తన స్పెషాలిటీని చూపిస్తున్నారు. స్పోర్ట్స్‌కి సంబంధించిన ప్రమోషన్స్‌లో కూడా బాలయ్య పాల్గొంటూ అందర్నీ ఇన్‌స్పైర్‌ చేస్తున్నారు.

ఇండియాలో ఇప్పుడు ప్రో కబడ్డీ ఎంత ప్రాచుర్యంలోకి వచ్చిందో అందరికీ తెలిసిందే. యుద్ధభూమిని తలపించే కబడ్డీ అంటే ఇష్టపడని భారతీయుడు ఉండడు. అలాంటి కబడ్డీ గేమ్‌ త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ప్రో కబడ్డీ కోసం ఇప్పుడు నందమూరి బాలకృష్ణ రంగంలోకి దిగుతున్నారు. ప్రో కబడ్డీ డిసెంబర్‌ 2న ప్రారంభం కాబోతోంది. దీనికి సంబంధించి రూపొందించిన కమర్షియల్‌ యాడ్‌ ఇప్పుడు ట్రెండిరగ్‌లోకి వచ్చింది. యుద్ధ వాతావరణాన్ని కబడ్డీకి లింక్‌ చేస్తూ రూపొందిన ఈ యాడ్‌లో బాలీవుడ్‌ నుంచి టైగర్‌ ష్రాఫ్‌, కన్నడ నుంచి సుదీప్‌, టాలీవుడ్‌ నుంచి బాలయ్య కనిపించారు. సినిమా యాడ్‌కి ఏమాత్రం తగ్గకుండా ఎంతో గ్రాండ్‌గా తీసిన ఈ యాడ్‌లో బాలకృష్ణ యుద్ధ వీరుడుగా కదనరంగంలో విశ్వరూపాన్ని చూపిస్తూనే కబడ్డీ కోర్టులో కూడా తన సత్తాని చూపిస్తూ తొడ కొట్టడం విశేషం. ఈ యాడ్‌ విజువల్స్‌ చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రో కబడ్డీ గురించి చెబుతూ సోషల్‌ మీడియాలో ఈ ఆటపై తనకు ఉన్న గౌరవాన్ని చాటుకున్నారు బాలయ్య. ‘కబడ్డీ.. మన మట్టిలో పుట్టిన ఆట.. మన తెలుగువాడి పౌరుషాన్ని తెలిపే ఆట.. కండల బలమే ఆయుధంగా.. మైదానమే రణస్థలంగా.. పోరాడే ఈ దమ్మున్న ఆటను అస్సలు మిస్‌ కావద్దు.. చూడండి’ అంటూ బాలకృష్ణ అందర్నీ ఇన్‌స్పైర్‌ చేసే విధంగా సోషల్‌ మీడియాలో స్పందించారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.