English | Telugu

'బాలయ్య' హీరో ఆఫ్‌ ది ఇయర్‌

గత నలభై సంవత్సరాలుగా టాలీవుడ్ టాప్ స్టార్ లలో ఒకరిగా వుంటూ, ఇప్పటికి తన సినిమాలతో యంగ్ స్టార్ హీరోలకు పోటీనిస్తున్న వ్యక్తి నందమూరి బాలకృష్ణ. అభిమానులు ముద్దుగా నందమూరి నటసింహం అంటు౦టారు. ఈ నటసింహానికి ఈ ఏడాది బాగా కలిసివచ్చిందని చెప్పాలి. గత కొంతకాలంగా బాక్స్ ఆఫీస్ వద్ద సరైన హిట్ లేని బాలయ్య, ఈ ఏడాది ‘లెజెండ్‌’ సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద తన పవర్ ని మరోసారి చూపించాడు. ఈ సినిమా ఏకంగా 275 రోజుల ప్రదర్శన కూడా పూర్తిచేసుకుంది. రెండో వారంలోనే సినిమా ఆచూకీ గల్లంతయిపోతున్న రోజుల్లో...ఓ సినిమా 275 రోజుల ఆడింది అంటే అది బాలయ్యకే చెల్లింది. అలాగే ఈ సంవత్సరం ఆయనకు అదనంగా ఓ గుర్తింపు యాడ్ అయ్యింది. అదే బాలయ్య ఎమ్మెల్యే కూడా అయ్యాడు. రాజకీయాల్లోకి అడుగు పెట్టి, తొలి దఫాలోనే అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, తనదైన శైలిలో ముందుకు దూసుకువెళ్తూన్నారు. ఈ సంవత్సరంలాగే 2015లో కూడా సినీ రంగంలో, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసి అభిమానుల కోరికను తీర్చాలని కోరుకుందాం.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.