Read more!

English | Telugu

20 కోట్ల దిశగా 'బలగం'!

'బలగం' సినిమా బాక్సాఫీస్ దగ్గర జోరు కొనసాగిస్తోంది. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 3న విడుదలైన మౌత్ టాక్ తో మూడో వారంలోనూ మంచి వసూళ్లు రాబడుతోంది. ముఖ్యంగా నైజాంలో అదిరిపోయే వసూళ్లతో దూసుకుపోతోంది. ఫుల్ రన్ లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.20 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టే అవకాశముంది.

ఓవరాల్ గా రూ.1.15 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన బలగం.. 17 రోజుల్లో రూ.8.32 కోట్ల షేర్(రూ.18.48 కోట్ల గ్రాస్) రాబట్టిందని ట్రేడ్ వర్గాల అంచనా. ఓ వైపు సినిమాకి పాజిటివ్ టాక్ రావడం, మరోవైపు కొత్త సినిమాలేవీ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటకపోవడం 'బలగం'కి కలిసొచ్చింది. గత శుక్రవారం 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి', 'కబ్జా' అనే రెండు చెప్పుకోదగ్గ సినిమాలు విడుదలయ్యాయి. అయితే ఆ రెండు కూడా నెగటివ్ టాక్ తెచ్చుకోవడంతో.. ఈ వీకెండ్ కూడా ప్రేక్షకులు బలగం సినిమాకే ఓటేశారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో బలగం సినిమా శనివారం నాడు రూ.91 లక్షల గ్రాస్, ఆదివారం రూ.1.82 గ్రాస్ రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో 17 రోజుల్లో రూ.8.24 కోట్ల షేర్(రూ.18.08 కోట్ల గ్రాస్) రాబట్టగా.. రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ లో కలిపి రూ.40 లక్షల గ్రాస్ సాధించింది. ఇప్పటిదాకా వరల్డ్ వైడ్ గా రూ.18.48 కోట్ల గ్రాస్ వసూలు చేసిన బలగం.. ఫుల్ రన్ లో రూ.20 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుంటుంది అనడంలో సందేహం లేదు.

కాగా, యువ హీరో విశ్వక్ సేన్ నటించిన 'దాస్ కా ధమ్కీ' మార్చి 22న విడుదల కానుంది. ఆ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే బలగం కలెక్షన్లకు కోతపడే అవకాశముంది.