English | Telugu

మళ్ళీ ఒకే వేదిక పైకి ఎన్టీఆర్, రామ్ చరణ్!

ఇటీవల కాలంలో వచ్చిన అసలుసిసలైన మల్టీస్టారర్ అంటే జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆర్ఆర్ఆర్' అని చెప్పొచ్చు. ఈ మూవీ అనౌన్స్ మెంట్ దగ్గర నుంచి ఆస్కార్ ప్రమోషన్స్ వరకు ఎన్టీఆర్, చరణ్ ఎన్నోసార్లు వేదిక పంచుకున్నారు. అయితే వీళ్ళిద్దరూ అక్కినేని యువ హీరో అఖిల్ కోసం మరోసారి వేదిక పంచుకోబోతున్నారని తెలుస్తోంది.

అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ 'ఏజెంట్'. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి పాన్ ఇండియా రేంజ్ లో హైప్ తీసుకురావడానికి 'ఆర్ఆర్ఆర్'తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్, చరణ్ ని రంగంలోకి దింపాలని మేకర్స్ భావిస్తున్నారట. ఎన్టీఆర్, చరణ్ చీఫ్ గెస్ట్ లుగా భారీస్థాయిలో 'ఏజెంట్' ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయట.

ఎన్టీఆర్, చరణ్ తో అఖిల్ కి మంచి బాండింగ్ ఉంది. అఖిల్ సినిమా ప్రమోషన్ కోసం ఎన్టీఆర్, చరణ్ వస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. గతంలో అఖిల్ నటించిన 'హలో' మూవీ ఈవెంట్ కి చిరంజీవితో పాటు చరణ్, 'మిస్టర్ మజ్ను' ఈవెంట్ కి ఎన్టీఆర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇప్పుడు 'ఏజెంట్' ఈవెంట్ కోసం ఎన్టీఆర్, చరణ్ ఇద్దరూ రంగంలోకి దిగబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే నందమూరి, అక్కినేని, మెగా హీరోలను ఒకే వేదిక చూడటం తెలుగు ప్రేక్షకులకు అసలుసిసలైన సెలబ్రేషన్ అని చెప్పొచ్చు.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...