English | Telugu

'పుష్ప-2' టీజర్ కి ముహూర్తం ఫిక్స్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రూపొందిన పాన్ ఇండియా మూవీ 'పుష్ప: ది రైజ్' 2021 డిసెంబర్ లో విడుదలై వరల్డ్ వైడ్ గా రూ.350 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఈ మూవీ రెండో భాగం 'పుష్ప: ది రూల్' పేరుతో రూపొందుతోంది. 'పుష్ప-2'పై పాన్ ఇండియా రేంజ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను రెట్టింపు చేసేలా ఈ చిత్రం నుంచి త్వరలో అదిరిపోయే అప్డేట్ రాబోతోంది.

అల్లు అర్జున్ పుట్టినరోజు కానుకగా ఏప్రిల్ 8న మూడు నిమిషాల నిడివితో ఓ టీజర్ విడుదల చేయాలని మూవీ టీమ్ భావిస్తోందట. సినిమా కాన్సెప్ట్ ని తెలిపేలా అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలతో ఈ టీజర్ ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీజర్ కట్ పూర్తయిందని, ప్రస్తుతం మ్యూజిక్ వర్క్ జరుగుతుందని సమాచారం. దీంతో పుష్ప-2 కాన్సెప్ట్ టీజర్ ఏ రేంజ్ లో ఉంటుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.