English | Telugu

అనుష్క శెట్టి పెళ్లి కబుర్లు!

తెలుగు, త‌మిళ చిత్రాల్లో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న అనుష్క శెట్టి సెప్టెంబ‌ర్ 7న ‘Ms శెట్టి Mr పొలిశెట్టి’ చిత్రంతో ఫ్యాన్స్‌, ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌నుంది. ఇందులో న‌వీన్ పొలిశెట్టి ఇందులో హీరోగా నటించారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేష‌న్స్ ఈ సినిమాను నిర్మించింది. రిలీజ్ సంద‌ర్భంగా అనుష్క మాట్లాడుతూ త‌న కెరీర్ ప‌రంగా, ప‌ర్స‌న‌ల్ లైఫ్ గురించి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను తెలియజేసింది.

‘‘బాహుబలిలో దేవసేన, అరుంధతిలో జేజెమ్మ, భాగమతి సినిమాల్లో నేను చేసిన పాత్రలెంతో ప్రత్యేకమైనవి. ఇలాంటి క్యారెక్ట‌ర్స్‌లో న‌టించ‌టానికి అదృష్టం ఉండాలి. నిజానికి ఇండ‌స్ట్రీలోకి నేను అడుగు పెట్టే స‌మ‌యానికి నాకు న‌ట‌న‌పై ఎలాంటి అవ‌గాహ‌న లేదు. ఎంతో మంది స‌పోర్ట్‌తో ఈస్థాయికి చేరుకున్నాను. అయితే కెరీర్ ప్రారంభంలో ఎలా ఓ జాగ్ర‌త్త‌తో సెట్స్‌కి వెళ్లేదాన్నో ఇప్పుడు కూడా అలాగే వెళుతున్నాను. ఎందుకంటే ఇక్క‌డ నేర్చుకునే విష‌యాలు ఎప్పుడూ ఉంటాయి. ప్రేక్ష‌కులు కోరుకునే పాత్ర‌లు చేయాల‌నే కోరిక నాకు ఎప్ప‌టికీ ఉంటుంది. మంచి స్క్రిప్ట్ దొరికిన‌ప్పుడు దాని కోసం రిస్క్ తీసుకోవాల‌ని అనిపిస్తుంది’’ అన్నారు అనుష్క. ఇదే సంద‌ర్బంలో పెళ్లిపై మీ అభిప్రాయ‌మేంట‌ని అని ప్ర‌శ్నించ‌గా పెళ్లికి తాను వ్య‌తిరేకం కాన‌ని, స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు పెళ్లి చేసుకుంటాన‌ని ఆమె తెలిపారు.

‘Ms శెట్టి Mr పొలిశెట్టి’ చిత్రంలో అన్విత అనే చెఫ్ పాత్ర‌లో అనుష్క క‌నిపించ‌బోతున్నారు. ఈ పాత్ర కోసం ఆమె ఇంట‌ర్నేష‌న‌ల్ చెఫ్ మాస్ట‌ర్స్ ద‌గ్గ‌ర ప్ర‌త్యేక‌మైన శిక్ష‌ణ‌ను తీసుకున్నారు. ఈ సినిమాకు మహేష్ బాబు.పి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.