English | Telugu

ఐదు నిమిషాల్లో 'బాహుబలి' సోల్డ్ అవుట్

'బాహుబలి' సినిమాకు వచ్చిన క్రేజ్ చూసి ప్రతి సినీ ప్రేక్షకుడు ఈ సినిమాని మొదటి రోజె చూడాలన్న ఆసక్తితో వున్నాడు. అయితే వారి కోరిక ఇప్పుడు నెరవేరేల కనిపించడం లేదు. ఎందుకంటే .. ఈ నెల 10న ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 4000 వేల థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ మొదలు పెట్టిన వెంటనే ఐదె ఐదు నిమిషాల్లో ఈ సినిమా 3రోజులకి సంబంధించిన టికెట్లన్ని అమ్ముడుపోవడం విశేషం. అంతే కాకుండా ధియేటర్ల వద్ద ఇస్తున్న అడ్వాన్సు బుకింగ్ సైతం ఇప్పటికే క్లోజ్ అయింది. దీంతో మూడు రోజుల సబందించిన షోస్ కు సంబంధించిన టికెట్స్ అన్నీ సేల్ అయిపోయాయని సమాచారం.

ఈ క్రేజ్ ని బట్టి చూస్తే బాహుబలి ఓపెనింగ్స్ లో టాలీవుడ్ లో ఎన్నడు లేని విధంగా భారీ రికార్డులు సృష్టించడం ఖాయమని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.