Read more!

English | Telugu

అల్లు అర్జున్ బద్రీనాథ్ ఆడియో రిలీజ్

అల్లు అర్జున్ "బద్రీనాథ్" ఆడియో రిలీజ్ ఘనంగా రిలీజయ్యింది. వివరాల్లోకి వెళితే గీతా ఆర్ట్స్ పతాకంపై, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్
హీరోగా, మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా భాటియా హీరోయిన్ గా, డైనమిక్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో,  అల్లు అరవింద్
నిర్మిస్తున్న చిత్రం "బద్రీనాథ్". ఈ చిత్రంలో హీరో అల్లు అర్జున్ ఇండియన్ సమురాయ్ గా నటిస్తున్నారు. మరకత మణి కీరవాణి ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. 

అల్లు అర్జున్ "బద్రీనాథ్" చిత్రం ఆడియో మే 7 వ తేదీ సాయంత్రం, హైదరాబాద్ శిల్పకళా వేదికలో అశేష అభిమానుల సమక్షంలో, మెగాస్టార్, పద్మభూషణ్, డాక్టర్ చిరంజీవి తొలి సి.డి.ని దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావుకి అందించగా అల్లు అర్జున్ "బద్రీనాథ్" ఆడియో మార్కెట్లోకి రిలీజ్ చేయబడింది. అల్లు అర్జున్ "బద్రీనాథ్" ఆడియో రిలీజ్ సభకు అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి, చిరంజీవి చిన్న కూతురు శ్రీజ, రామ్ చరణ్, అల్లు శిరీష్, వివివినాయక్, రాజమౌళి, రమా రాజమౌళి, కీరవాణి అతని భార్య శ్రీవల్లి, హీరోయిన్ తమన్నా, చిన్ని కృష్ణ తదితరులు హాజరయ్యారు.