English | Telugu

బాహుబలి రికార్డ్: ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్!!

రాజమౌళి తెరకెక్కించిన భారీ బడ్జెట్ మూవీ 'బాహుబలి' ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ గా నిలవబోతుంది. ఇప్పటికే ఇండియాలో 175కోట్ల షేర్ ను వసూళ్ళు చేసిన బాహుబలి, అమీర్ ఖాన్ 'పీకే' సినిమా సినిమా రికార్డులను బద్దలుకొట్టింది. అయితే అమీర్ 'పీకే' ఓకే బాషలో కలెక్షన్లు సాధించగా, బాహుబలి మాత్రం పలు బాషల్లో కలెక్షన్లు రాబట్టి, కొత్త రికార్డులను సృష్టిస్తోంది.

రెండో వారంలో కూడా 'బాహుబలి' కలెక్షన్ల జైత్రయాత్ర కొనసాగుతూ వుండడంతో, ఈ సినిమా ఇండియాలోనె మొదటి 200 కోట్ల షేర్ సాధించిన సినిమాగా నిలవబోతుంది. అయితే గ్రాస్ కలేక్షన్ల పరంగా చూస్తే ఇండియాలో 'పీకే'నె మొదటి స్థానంలో వుంటుంది.

అయితే 'బాహుబలి' ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని రాజమౌళి కూడా ఊహించి వుండరు. అంచనాలు మించి బాహుబలి ఇండియాలో కలెక్షన్ల కురిపిస్తోంది. ఈ దెబ్బతో రాజమౌళిపై మరింత ప్రెజర్ పెరగనుంది. బాహుబలి 2 కోసం ఇండియా మొత్తం భారీ అంచనాలతో ఎదురుచూడబోతుంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.