English | Telugu

పవన్ కళ్యాణ్ పుట్టినరోజున అషు రెడ్డి స్పెషల్ షో


ఈ రోజు పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)పుట్టినరోజు. తెలుగు చిత్ర పరిశ్రమకి చెందిన ఎంతో మంది అతిరధ మహారధులతో పాటు, రాజకీయ, వ్యాపార ప్రముఖులు పవన్ కి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ, విదేశాల్లో ఉన్న అభిమానులు అయితే పవన్ పుట్టిన రోజు వేడుకలని ఘనంగా జరుపుకుంటున్నారు.

రీసెంట్ గా బిగ్ బాస్ ఫేమ్ 'అషురెడ్డి'(Ashu Reddy)పవన్ కళ్యాణ్ కి ఇనిస్టాగ్రమ్(Instagram)వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తు ఒక పోస్ట్ చేసింది. సదరు పోస్ట్ లో 'మీరు పుట్టిన భూమ్మీద నేను కూడా పుట్టినందుకు ఎంతో గర్వంగా ఉంది. హ్యాపీ బర్త్ డే గాడ్ ఆఫ్ పీపుల్. మనల్ని ఎవడ్రా ఆపేది. ఎప్పటికి సెప్టెంబర్ మంత్ స్పెషల్ గా ఉంటుందనిచెప్పుకొచ్చింది. పవన్ పేరుని తన ఒంటిపై పచ్చ బొట్టుగా వేసుకొని ఉన్న పిక్ ని కూడా షేర్ చేసింది.

అషు రెడ్డి పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని. తన అభిమానాన్ని పలు రూపాల్లో ఎన్నోసార్లు తెలియచేసింది. ఫోకస్, చల్ మోహన్ రంగా వంటి చిత్రాల్లో నటించడంతో పాటు సోషల్ మీడియాలో సెలబ్రిటీ గా కూడా ఉంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.