English | Telugu
బాబు మూవీతో అర్జున్ కళ్యాణ్...
Updated : Dec 11, 2023
బిగ్ బాస్ ద్వారా ఆడియన్స్ కి బాగా రీచ్ ఐన మోడల్, యాక్టర్ అర్జున్ కళ్యాణ్. అలాగే శ్రీసత్యతో గతంలోనే పరిచయం ఉండడంతో వీళ్ళ మధ్య సోషల్ మీడియాలో చాలా ట్రోలింగ్స్ కూడా వచ్చాయి. ఇక ఇప్పుడు అర్జున్ కళ్యాణ్, శ్రీసత్య ఎవరి లైఫ్ తో వాళ్ళు బిజీ ఇపోయారు. అప్పుడప్పుడు కొన్ని ఈవెంట్స్ కి వాటికి కలుస్తూ ఉంటారు. అలాంటి అర్జున్ కళ్యాణ్ తన నెక్స్ట్ అప్ డేట్స్ విషయమై ఒక వీడియో చేసి తన ఇన్స్టాగ్రామ్ లో పెట్టాడు.
"నేను బాబు అనే కొత్త ప్రాజెక్ట్ చేస్తున్నాను. ఆ మూవీ షూటింగ్ పూర్తయ్యింది..ఇప్పుడు ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. త్వరలో ప్రమోషన్స్ ని మొదలుపెడతాం ఆల్రెడీ హీరోయిన్ పోస్టర్స్ అన్నీ రెడీ అయ్యాయి. కుషిత కళ్ళాపు పిక్స్ రిలీజ్ కూడా అయ్యాయి.. ఐతే రిలీజ్ డేట్ కోసం ఎదురు చూస్తున్నాం. మే బి జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ ఉండొచ్చు.
ఈ మూవీతో పాటు డిస్నీ ప్లస్ హాట్స్టార్ తో కలిసి ఒక వెబ్ సిరీస్ లో చేయడానికి ఆల్రెడీ సైన్ చేసాను. ప్రస్తుతానికి ఒక షెడ్యూల్ ని పూర్తి చేసాను. ఐతే కొంత మంది నటుల డేట్స్ కొంచెం ప్రాబ్లమ్ గా ఉంది..అలాగే బ్రహ్మాజీ, ఆమని గారు నాకు పేరెంట్స్ రోల్స్ లో నటిస్తున్నారు. రవిశివతేజ నా బ్రదర్ గా చేస్తున్నాడు, అన్యుక్త నాతో జోడీగా నటిస్తోంది. గాయత్రీ చాగంటి రవికి పెయిర్ గా నటిస్తోంది. " అని చెప్పాడు. అలాగే బిగ్ బాస్ సెవెన్ లో శివాజీ బాగా ఆడుతున్నాడని చెప్పాడు. "ఎలిమినేషన్స్ కి ఓటింగ్ కి లింక్ ఉండదు..బిగ్ బాస్ టీమ్ కి కావాల్సిన కంటెంట్ వచ్చాక వాళ్ళు హౌస్ నుంచి పంపించేస్తారు వోటింగ్ ఉన్నా లేకపోయినా..ఎందుకంటే అది రియల్ షో కాదు రియాలిటీ షో మరి...బిగ్ బాస్ కి రేటింగ్ ఇంపార్టెంట్ అంటే ఏడవడాలు, కొట్టుకోవడాలు, అరుచుకోవడాలు, లవ్ ట్రాక్ ఇలాంటివే ఎక్కువగా చూస్తారు. బిగ్ బాస్ ని, అందులోని కంటెస్టెంట్స్ ని మరీ పర్సనల్ గా తీసుకోకండి..డిమాండ్ అండ్ సప్లై సిద్ధాంతం ఇక్కడ వర్తిస్తుంది." అంటూ బిగ్ బాస్ గురించి చాలా విషయాలు చెప్పాడు.