English | Telugu

నవంబర్‌ 7న యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ ‘జైహింద్‌ 2’

యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ హీరోగా శ్రీరామ్‌ ఫిలిమ్స్‌ బ్యానర్‌పై రూపొందుతోన్న చిత్రం ‘జైహింద్‌2’. సుర్విన్‌ చావ్లా, చార్లెట్‌ క్లారి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో ఇటీవలే విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని నవంబర్‌ 7న విడుదల చేయనున్నారు.

ఈ సందర్భంగా హీరో, దర్శకనిర్మాత అర్జున్‌ మాట్లాడుతూ ` ‘‘ఈ చిత్రానికి సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. నవంబర్‌ 7న ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తున్నాం. ఇటీవల విడుదలైన ఆడియోకు చాలా మంచి స్పందన వస్తోంది. అర్జున్‌ జన్యా చాలా మంచి మ్యూజిక్‌ అందించారు. టెక్నికల్‌గా ఈ చిత్రాన్ని చాలా హై స్టాండర్డ్స్‌లో చేశాము. ఫైట్స్‌ విషయానికి వస్తే నా గత చిత్రాల ఫైట్స్‌ అన్నీ ఒక వైపుంటే ఈ సినిమా ఫైట్స్‌ మరో వైపు నిలుస్తాయి. ఈ సినిమాలో ఎమోషనల్‌ క్యారెక్టర్‌ చేశాను. ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు, బ్యాంకాక్‌, సింగపూర్‌, యు.కె దేశాల్లో ఈ సినిమాని చిత్రీకరించాం. ఎడ్యుకేషన్‌ సిస్టమ్‌పై రూపొందిన ఈ చిత్రం అందరికీ నచ్చుతుంది’’ అన్నారు.

బ్రహ్మానందం, అలీ, రాహుల్‌ దేవ్‌, రఘుబాబు, షఫీ, అమిత్‌ కుమార్‌ తివారీ, వినయ్‌ ప్రసాద్‌, రవికాలే తదితరులు ఇతర తారాగణంగా నటించిన ఈ చిత్రానికి ఎడిటర్‌: కె.కె, ఆర్ట్‌: శశిధర్‌ అడప, సహనిర్మాతలు: ఐశ్వర్య, అంజన, కథ, స్క్రీన్‌ప్లే, నిర్మాత, దర్శకత్వం: అర్జున్‌.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.