English | Telugu

ఖాన్స్ పై మురుగదాస్ కీలక వ్యాఖ్యలు

ఇండియన్ సిల్వర్ స్క్రీన్ వద్ద ప్రముఖ తమిళ దర్శకుడు 'ఏఆర్ మురుగదాస్'(Ar Murugadoss)కి ప్రత్యేక స్థానం ఉంది. ఆయన తెరకెక్కించిన చాలా చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో విడుదలై మంచి విజయాన్ని అందుకున్నాయి. ఈ ఏడాది మార్చి 28 న మురుగదాస్ దర్శకత్వంలో 'సికందర్'(Sikandar)మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. స్టార్ హీరో సల్మాన్ ఖాన్(Salman Khan),రష్మిక(Rashmika Mandanna)జంటగా నటించారు. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం దారుణమైన పరాజయాన్ని అందుకుంది. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్ ని అందుకోవాలని మరో స్టార్ హీరో 'శివకార్తికేయన్' తో 'మదరాసి'(Madharaasi)అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. సెప్టెంబర్ 5 న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యాయి.

ఇందుకు సంబంధించి రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో 'మురుగదాస్' మాట్లాడుతు ఎనిమిది సంవత్సరాల క్రితమే 'మదరాసి' కథ లైన్ ని 'షారుక్ ఖాన్'(Shah Rukh Khan)కి చెప్తే ఆయనకి బాగా నచ్చింది. పూర్తి స్క్రిప్ట్ రెడీ కాకపోవడంతో హీరో క్యారక్టర్ గురించి తక్కువగా చెప్పాను. స్క్రిప్ట్ సిద్ధమయ్యాక, రెండు వారాల తర్వాత మెసేజ్ చేశాను, కానీ షారుఖ్ నుంచి రిప్లై రాలేదు. ఆ తర్వాత షారుక్ ఎప్పుడు సంప్రదించలేదు. దీంతో శివకార్తికేయన్ తో తెరకెక్కించాలని నిర్ణయించుకున్నాను.

సికందర్ మూవీ షూటింగ్ ఎక్కువ భాగం రాత్రి వేళల్లోనే జరిగేది. డే ఎఫెక్ట్స్ సీన్స్ ని కూడా, నైట్ చిత్రీకరించేవాళ్ళం. సల్మాన్ రాత్రి ఎనిమిది గంటలకి షూట్ కి వచ్చే వాళ్ళు. స్టార్ హీరోలతో షూటింగ్ అంటే అనుకున్న ప్రకారం జరగవు .దీంతో సికందర్ లో ఎన్నో భావోద్వేగ అంశాలు ఉన్నప్పటికీ అనుకున్న విధంగా తెరకెక్కించలేకపోయానని మురుగదాస్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ మాటలు సినీ సర్కిల్స్ లో వైరల్ గా మారాయి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .