English | Telugu

కొచ్చిలో జైల‌ర్‌... ఎగిరి గంతేసిన కాటుక క‌ళ్ల అప‌ర్ణ‌!

అప‌ర్ణ బాల‌ముర‌ళి తెలుగులో ఎన్ని సినిమాలు చేసినా, యూత్ గుండెల‌ను పిండేసింది మాత్రం ఆకాశం నీ హ‌ద్దురా సినిమాలోనే. కాటుక క‌నులే అంటూ అప‌ర్ణ ఆ సినిమాలో చేసిన యాక్టింగ్‌కి ఫిదా అయిపోయారు మ‌న కుర్ర‌కారు. ఆమె ఎప్పుడైనా ఒక్క‌సారి లైఫ్‌లో క‌నిపించ‌క‌పోతుందా, ఒక్క సెల్ఫీ తీసుకోక‌పోతామా? అని ఎదురుచూస్తున్న‌వారి సంఖ్యకు లెక్కేలేదు. మ‌రి అలాంటి అప‌ర్ణ‌కు ఓ స్టార్‌తో సెల్ఫీ తీసుకోవాల‌నిపిస్తే? ఎవ‌రితో అయి ఉంటుంది? మీరు అంత ఆలోచించ‌క్క‌ర్లేదు. నేనే చెప్తా అంటూ ఆన్స‌ర్‌గా ఓ పిక్ పోస్ట్ చేశారు ఈ బ్యూటీ. ర‌జ‌నీకాంత్ తో ఉన్న ఫొటో పోస్ట్ చేసి... ది ఒన్ అండ్ ఒన్లీ అని క్యాప్ష‌న్ కూడా రాశారు అప్పు.

ప‌క్కా ఫ్యాన్ గ‌ర్ల్ మొమెంట్ అంటూ నెటిజ‌న్ల కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. కొచ్చి ఎయిర్‌పోర్టులో ఈ పిక్ తీసుకున్న‌ట్టున్నారంటూ మ‌రికొంద‌రు స‌ర‌దాగా వ్యాఖ్యానిస్తున్నారు. ర‌జ‌నీకాంత్ హీరోగా న‌టిస్తున్న జైల‌ర్ సినిమా ఇప్పుడు కొచ్చిలో తెర‌కెక్కుతోంది. ఈ మూవీ కోసం కొచ్చికి వెళ్లిన ర‌జ‌నీతోనే పిక్ తీసుకున్నారు అపర్ణ‌. నెల్స‌న్ దిలీప్‌కుమార్ ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్న సినిమా ఇది. మోహ‌న్‌లాల్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. షూటింగ్ ఆఖ‌రి ద‌శ‌లో ఉంది. కొచ్చిలో జ‌రిగే ఆఖ‌రి షెడ్యూల్‌తో గుమ్మ‌డికాయ కొట్టేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు. మోహ‌న్‌లాల్‌, ర‌జ‌నీకాంత్ మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాల‌ను ఇక్క‌డ తెర‌కెక్కించాల‌న్న‌ది డైర‌క్ట‌ర్ ప్లాన్‌. అక్క‌డ ప‌ది రోజులు షూటింగ్ ఉంటుంది ర‌జనీకాంత్‌కి. ఏప్రిల్ 15 వ‌ర‌కు జ‌రిగే షెడ్యూల్‌లో మోహ‌న్‌లాల్ పార్టిసిపేట్ చేస్తారు.

ఈ సినిమాలో ర‌జ‌నీకాంత్ జైల‌ర్ ముత్తువేల్ పాండ్య‌న్‌గా న‌టిస్తున్నారు. త‌మిళ‌నాడు నుంచి శివ‌కార్తికేయ‌న్ కీ రోల్ చేస్తున్నారు. క‌న్న‌డ నుంచి శివ‌రాజ్ కుమార్ కూడా ఈ సినిమాలో స్పెష‌ల్ రోల్ చేస్తున్నారు. డార్క్ కామెడీ థ్రిల్ల‌ర్ ఇది. ర‌మ్య‌కృష్ణ‌, యోగిబాబు, వ‌సంత్ ర‌వి, వినాయ‌క‌న్ కీ రోల్స్ చేస్తున్నారు. బాలీవుడ్ యాక్ట‌ర్ జాకీ ష్రాఫ్ విల‌న్‌గా క‌నిపిస్తారు. ర‌జ‌నీతో జాకీష్రాఫ్ 36 ఏళ్ల త‌ర్వాత చేస్తున్న మూవీ ఇది. అనిరుద్ ర‌విచంద్ర‌న్ సంగీతం అందిస్తున్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.