English | Telugu

కోలీవుడ్ స్టార్ అజిత్ తండ్రి కన్నుమూత

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అజిత్ తండ్రి పి. సుబ్ర‌హ్మ‌ణ్యం(84) కన్నుమూశారు. కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. సుబ్రహ్మణ్యంకు ముగ్గురు కుమారులు కాగా, అజిత్‌ రెండో కుమారుడు. భార్య షాలిని, పిల్లలతో కలిసి యూరోప్‌ టూర్‌ లో ఉన్న అజిత్.. తండ్రి మరణ వార్త తెలియగానే అక్కడినుంచి బయలుదేరినట్లు తెలుస్తోంది. అజిత్ చెన్నై చేరుకున్న తరువాత అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సుబ్ర‌హ్మ‌ణ్యం మృతి పట్ల సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.