English | Telugu
ఆ విషయంలో నయనతారను అనుష్క ఫాలో అవుతుందా?
Updated : Sep 4, 2023
స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి కథానాయికగా నటించిన తాజా చిత్రం ‘Ms శెట్టి Mr పొలిశెట్టి’. ఇందులో హీరో నవీన్ పొలిశెట్టి నటించారు. సెప్టెంబర్ 7న సినిమా రిలీజ్ అవుతుంది. సినిమా రిలీజ్‌కు మూడు రోజుల సమయం మాత్రమే ఉంది. అయితే మన శాండీల్ వుడ్ బ్యూటీ మాత్రం అస్సలు కనపడటమే లేదు. నయనతార సాధారణంగా తన సినిమాలకు సంబంధించిన ప్రమోషన్స్‌లో పాల్గొనదు. ఈ విషయాన్ని ఆమె ముందుగానే చెప్పి సైన్ చేస్తుంది. ఇప్పుడు అనుష్క కూడా ఆ రూట్‌లోకి వచ్చినట్లు తెలుస్తోంది. అసలు అనుష్క శెట్టి ఇమేజ్‌ను బేస్ చేసుకుని ‘Ms శెట్టి Mr పొలిశెట్టి’ సినిమాను రూపొందించారు మేకర్స్.
కానీ ఇప్పుడేమో అనుష్క ఏమో ‘Ms శెట్టి Mr పొలిశెట్టి’ ప్రమోషన్స్‌లో పాల్గొనటం లేదు. నిజంగా ఇది ఆమె అభిమానులకు నిరాశ పరిచే అంశం. కానీ అసలు అనుష్క ఎందుకు మూవీ ప్రమోషన్స్‌కు రావటం లేదనేది అందరిలోనూ మిలియన్ డాలర్స్ ప్రశ్నగా మిగిలింది. అయితే సినీ సర్కిల్స్ కథనం మేరకు ‘Ms శెట్టి Mr పొలిశెట్టి’ కోసం ఓ గ్రూపు ఇంటర్వ్యూలో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూను ఇంకా ప్రసారం చేయలేదు. దానికి సంబంధించిన ప్రోమోను మంగళవారం రిలీజ్ చేసి బుధవారం ఇంటర్వ్యూను విడుదల చేస్తారట.
యూవీ కియేషన్స్ బ్యానర్‌పై రూపొందిన ‘Ms శెట్టి Mr పొలిశెట్టి’ సినిమాకు మహేష్ బాబు.పి దర్శకత్వం వహించారు. నవీన్ పొలిశెట్టి ఈ మూవీ సక్సెస్‌పై ఎంతో హోప్స్ పెట్టుకున్నారు. మరి తన నమ్మకం నిజమవుతుందో లేదో తెలియాలంటే మరో మూడు రోజులు ఆగితే సరిపోతుంది.