English | Telugu
టాలీవుడ్‌లో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత మృతి
Updated : Nov 11, 2023
శనివారం ఉదయం నుంచి ఎక్కడ చూసినా నటుడు చంద్రమోహన్ మరణవార్త గురించే చర్చ. ఆయనకు నివాళి అర్పిస్తూ.. సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ మరో విషాద వార్త వినాల్సి వస్తోంది. ప్రముఖ నిర్మాత యక్కలి రవీంద్రబాబు(55) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు.
శ్రావ్య ఫిలింస్ వ్యవస్థాపక నిర్మాతగా మిత్రులతో కలిసి ‘సొంత ఊరు’, ‘గంగపుత్రులు’ వంటి అవార్డు సాధించిన చిత్రాలతోపాటు ‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ’, ‘రొమాంటిక్ క్రిమినల్స్’, ‘గల్ఫ్’, ‘వలస’ వంటి చిత్రాలను రవీంద్రబాబు నిర్మించారు. మంచి అభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకున్న రవీంద్రబాబు మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి చార్టర్డ్ ఇంజనీర్‌గా సేవలు అందిస్తూనే సినిమా పట్ల తనకున్న ఆసక్తితో 17 సినిమాలను నిర్మించారు. తను నిర్మించిన సినిమాల ద్వారా అవార్డులు కూడా అందుకున్నారు. నిర్మాత రవీంద్రబాబు మృతి పట్ల సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.