English | Telugu

ఓటీటీ సంస్థలకు షాక్‌ ఇచ్చిన ‘నరసింహ’!

సినిమాలను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు రావడం బాగా తగ్గిన విషయం తెలిసిందే. దీంతో ఓటీటీలకు డిమాండ్‌ బాగా పెరిగింది. దీంతో నిర్మాతలు కూడా ఓటీటీలపై ఎక్కువ ఆధారపడుతున్నారు. దాన్ని ఆసరాగా చేసుకొని ఓటీటీ సంస్థలు నిర్మాతలపై ఆధిపత్యం చలాయిస్తున్నాయి. కొన్ని సినిమాల రిలీజ్‌ డేట్‌లను కూడా ఓటీటీలే డిసైడ్‌ చేస్తున్నాయి. సినిమా రిలీజ్‌కి ముందే ఓటీటీ రైట్స్‌ అగ్రిమెంట్స్‌ జరిగిపోతుండడంతో ఈ పరిస్థితి వచ్చింది. దీంతో నిర్మాతలు కూడా ఓటీటీ చెప్పిన కండిషన్స్‌కి తలొగ్గక తప్పడం లేదు. కానీ, ఇప్పుడు కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టిస్తున్న ‘మహావతార్‌ నరసింహ’ ఓటీటీ సంస్థలకు పెద్ద షాక్‌ ఇచ్చింది.

హై ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉన్న సినిమాలను ముందే బుక్‌ చేసుకునేందుకు ఓటీటీ సంస్థలు ఉత్సాహం చూపిస్తుంటాయి. మహావతార్‌ నరసింహ చిత్రం ఓటీటీ డీల్‌ జరగకముందే రిలీజ్‌ అయింది. ఎవరూ ఊహించని కలెక్షన్స్‌తో అదరగొడుతోంది. ఇప్పటికే 100 కోట్ల క్లబ్‌లో చేరిపోయిన ఈ సినిమా కోసం ఓటీటీ సంస్థలు పోటీ పడుతున్నాయి. ఫైనల్‌గా జియో హాట్‌స్టార్‌ ఓటీటీ హక్కులు దక్కించుకుందని, నాలుగు వారాల్లో స్ట్రీమింగ్‌ కూడా జరుగుతుందని ప్రచారం జరుగుతోంది. బయట జరుగుతున్న ఈ ప్రచారానికి మహావతార్‌ నరసింహ టీమ్‌ చెక్‌ పెట్టింది. థియేటర్లలో అద్భుతంగా రన్‌ అవుతున్న నేపథ్యంలో ఇప్పట్లో ఓటీటీ హక్కులు ఇచ్చే ఆలోచన లేదని చిత్ర యూనిట్‌ తేల్చిచెప్పింది. థియేటర్‌లో రన్‌ని బట్టి తర్వాత ఈ విషయం గురించి ఆలోచిస్తామని వారు చెబుతున్నారు. మరి ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ ఏ సంస్థ దక్కించుకుంటుందో చూడాలి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .