English | Telugu
‘యానిమల్’ సునామికి సాక్ష్యం
Updated : Dec 4, 2023
డిసెంబర్ 1 .. ఈ డేట్ ఇప్పుడు ఇండియన్ సినిమా హిస్టరీ లో చిరస్థాయిగా నిలిచిపోనుంది. ఈ డేట్ లో విడుదలైన యానిమల్ ఇప్పుడు సరికొత్త రికార్డుల దిశగా దూసుకుపోతుంది.కేవలం మూడంటే మూడు రోజుల్లో యానిమల్ సాధించిన కలెక్షన్స్ ఇప్పుడు టాక్ అఫ్ ది పాన్ ఇండియాగా మారాయి.
యానిమల్ మూవీ కేవలం మూడంటే మూడు రోజుల్లో వరల్డ్ వైడ్ గా 356 కోట్ల రూపాయిల గ్రాస్ ని సాధించింది. తొలి రోజు 116 కోట్ల గ్రాస్ ని సాధించిన యానిమల్ ఆ తర్వాత రెండు రోజులకి అంటే వీకెండ్స్ అయిన శని, ఆదివారాల్లో రికార్డు స్థాయి కలెక్షన్స్ ని సాధించింది. ఇప్పుడు ఈ కలెక్షన్స్ తో సినిమా హిట్ రేంజ్ అందరికి అర్ధం అయ్యింది. విడుదల అయిన అన్ని చోట్ల హౌస్ ఫుల్స్ తో దూసుకెళ్తున్న యానిమల్ రాబోయే రోజుల్లో మరిన్ని కొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
యానిమల్ మూవీలో బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ వన్ మాన్ షో తో పాటు రష్మిక, అనిల్ కపూర్, బాబీ డియోల్ పెర్ఫార్మెన్స్ మూవీకి ప్లస్ పాయింట్ అయ్యింది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన యానిమల్ ని భద్రకాళి స్టూడియోస్ ,సినీ వన్, టి సిరీస్ ల పై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగాలు నిర్మించారు.