English | Telugu

రెండు రోజుల్లో రూ.200 కోట్లకుపైగా కలెక్ట్‌ చేసిన ‘యానిమల్‌’

రణబీర్‌ కపూర్‌, రష్మిక జంటగా సందీప్‌రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందిన పాన్‌ ఇండియా మూవీ ‘యానిమల్‌’. డిసెంబర్‌ 1న విడుదలైన ఈ సినిమా అందరి అంచనాలను మించి సూపర్‌హిట్‌ దిశగా పరుగులు తీస్తోంది. రెండు రోజుల్లోనే రూ.200 కోట్లకు పైగా కలెక్షన్‌ సాధించిందీ సినిమా. మొదటి రోజునే ఇండియాలో రూ.71 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది.

సినిమా బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌ 210 కోట్ల షేర్‌, 400 కోట్లకుపైగా గ్రాస్‌ వసూళ్లను నమోదు చేయాల్సి ఉంది. తొలి రోజు ఇండియాలోనే రూ.71 కోట్ల కలెక్షన్‌ కొల్లగొట్టింది. ఓవర్సీస్‌లో సుమారుగా 45 కోట్ల రూపాయలు వసూలు చేసిందని ట్రేడ్‌ వర్గాలు వెల్లడిరచాయి. దాంతో ప్రపంచవ్యాప్తంగా యానిమల్‌ సినిమా ఫస్ట్‌ డే రూ.116 కోట్లకు పైగా కలెక్షన్స్‌ రాబట్టింది. ఈ సంవత్సరంలో వంద కోట్లు దాటిన బాలీవుడ్‌ చిత్రాల్లో మూడవదిగా నిలిచింది ‘యానిమల్‌’ మూవీ. రెండో రోజు కలెక్షన్ల విషయానికొస్తే.. ఈ మూవీ ఇండియాలో రూ.60.92 కోట్లు, గ్లోబల్‌ వైజ్‌గా రూ. 129 కోట్లకు పైగా కలెక్షన్‌ రాబట్టింది. రెండు రోజుల్లో ‘యానిమల్‌’ మూవీ ఓవరాల్‌గా 230 కోట్లుకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమా రణబీర్‌ కెరీర్‌ లోనే బిగ్గెట్‌ హిట్‌గా నిలిచింది. వచ్చేవారం ఈ సినిమా కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది. ఓవరాల్‌గా ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచేలా కనిపిస్తోంది.