English | Telugu
పాపం.. అనసూయని బూతులు తిట్టారట!
Updated : Feb 21, 2015
ఈ సోషల్ నెట్ వర్కింగ్ సైట్లు వచ్చాక.. సెలబ్రెటీలకు ప్రశాంతత లేకుండా పోయింది. ఫేస్ బుక్ , ట్విట్టర్‌లను వేదికగాచేసుకొని సెలబ్రెటీలు తమ సమాచారాన్నంతా ఫ్యాన్స్‌కి ఇవ్వాలనుకొంటారు. కానీ కొంతమంది అభిమానం మరీ వెర్రి తలలు వేస్తుంటుంది కదా..?? అందుకే ఫేస్ బుక్ , ట్విట్టర్‌లలో అసభ్యమైన కామెంట్లతో చిరాకు తెప్పిస్తుంటారు. ఇలాంటివి టాప్ యాంకర్ అనసూయకూ ఎదురయ్యాయట. ఈ విషయాన్ని తానే స్వయంగా చెప్పుకొచ్చింది. సోషల్ నెట్ వర్కింగ్ సైట్లో కొంతమంది దురాభిమానులు తనను బండబూతులు తిట్టేవారట. అయితే వాటిని అనసూయ ఎప్పుడూ డిలీజ్ చేయలేదట. వాళ్ల తప్పు వాళ్లే తెలుసుకొంటారు అని వదిలేసేదట. కొంతమందికి రిప్లై కూడా ఇచ్చేదట. మీ ఇంట్లో ఆడవాళ్లతో మీరు ఇలానే మాట్లాడతారా?? అని తిరిగి సమాధానం ఇచ్చేదట. దాంతో అవతలివాళ్లు కామ్ అయిపోయేవారట. అద్దాల మేడమీద రాళ్లు వేయాలనుకొంటారు.. బద్దలైతే అదో ఆనందం వాళ్లకు అలాంటి వాళ్లని మనం ఏం చేయగలం?? అంటూ తెగ ఫీలైపోతోంది అనసూయ. సెలబ్రెటీ అనేసరికి ఇవి కూడా భరించాలి మరి..!!