English | Telugu
ముద్దు పేరు వెనుక సీక్రెట్ చెప్పిన చరణ్
Updated : Feb 21, 2015
రామ్‌చరణ్‌కి ముద్దుగా చెర్రీ అనిపిలుచుకొంటారు తెలుసు కదా..?? ఇంతకీ చరణ్‌కి ఆ ముద్దు పేరు ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా వచ్చింది? ముందుగా పిలిచింది ఎవరు?? ఈ విషయాలు మీకు తెలుసా?? చిన్నప్పుడు చరణ్‌ని అందరూ చరణ్.. చరణ్ అనే పిలిచేవాళ్లు. చరణ్ అక్క సుస్మితకి, చెల్లి శ్రీజకి ముద్దు పేర్లు ఉండేవి. వాళ్లని ముద్దు పేర్లతో పిలిచి.. నన్నెందుకు పిలవరు?? అని చరణ్ అలిగాడట. ఈ విషయాన్ని డాడీ చిరంజీవి దగ్గరకు తీసుకెళ్లాడట. ''నాన్న.. నన్నందకు చరణ్ చరణ్ అని పిలుస్తున్నారు.. నాకూ ఓ ముద్దు పేరు కావాలి..'' అని అలిగాడట. అప్పటికప్పుడు చిరు.. బాగా ఆలోచించి.. ''చెర్రీ... ఇక ఇదే నీ ముద్దు పేరు.'' అన్నారట. అప్పటి నుంచి చరణ్ కాస్త చెర్రీ అయిపోయాడు. ఇంట్లో డాడీ ఒక్కరే చరణ్‌ని ముద్దు పేరుతో పిలుస్తారట. మిగిలినవాళ్లంతా చరణ్, చరణ్ అనే అంటారట. ఈ ముద్దు పేరు డాడీకి మాత్రమే సొంతం అంటున్నాడు చరణ్. ఈ విషయాన్ని మీలో ఎవరు కోటీశ్వరుడు పోగ్రాంలో బయటపెట్టాడు చరణ్. అదీ చెర్రీ పేరు వెనుక కథ..