English | Telugu

'ది రాజా సాబ్' మూవీ ఫస్ట్ రివ్యూ.. ప్రభాస్ నమ్మకాన్ని మారుతి నిలబెట్టుకున్నాడా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) మొదటిసారి హారర్ కామెడీ జానర్ లో నటించిన సినిమా 'ది రాజా సాబ్'(The Raja Saab). మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా, సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదలవుతోంది. ఈ రోజు(జనవరి 8) రాత్రి నుంచే ప్రీమియర్ షోలు ప్రదర్శించనున్నారు.

ఇంతవరకు ప్రభాస్ చేయని హారర్ కామెడీ జానర్ కావడం, పైగా వింటేజ్ ప్రభాస్ ని చూడబోతున్నారని ముందు నుంచి మూవీ టీమ్ చెప్పడంతో.. 'రాజా సాబ్'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. సెన్సార్ రిపోర్ట్ కూడా పాజిటివ్ గానే వచ్చింది. ఇక ఇండస్ట్రీ వర్గాల్లోనూ ఈ సినిమా గురించి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది.

ఇప్పటికే 'ది రాజా సాబ్'ను ప్రత్యేకంగా వీక్షించిన కొందరు.. ఈ సినిమాని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. మూడు గంటల నిడివి గల ఈ మూవీ.. స్క్రీన్ పై మ్యాజిక్ చేసిందని చెబుతున్నారు. రాజ కుటుంబానికి చెందిన రాజాసాబ్(ప్రభాస్) తన నానమ్మతో కలిసి సాధారణ జీవితం గడపటం, తమ కుటుంబానికి చెందిన రాజభవనాన్ని హీరో అమ్మాలనుకోవడం, ఈ క్రమంలో తాత ఆత్మతో పోరాడాల్సి రావడం వంటి ఎపిసోడ్స్ తో సినిమా నడిచిందట.

ఫస్ట్ హాఫ్ లో ముగ్గురు హీరోయిన్స్ తో ప్రభాస్ చేసే అల్లరి 'డార్లింగ్' సినిమా నాటి ప్రభాస్ ని గుర్తు చేస్తుందట. ప్రభాస్ ఎంట్రీ సీన్, కామెడీ, డ్యాన్స్ లు ఫ్యాన్స్ కి ఫీస్ట్ అట. ఫస్ట్ హాఫ్ చాలా సరదాగా సాగిపోయిందని అంటున్నారు. ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోయిందట. సెకండాఫ్ లో ఎన్నో థ్రిల్లింగ్ మూమెంట్స్ ఉన్నాయని, అదే సమయంలో కామెడీ కూడా బాగా వర్కౌట్ అయిందని వినికిడి. కామెడీతో పాటు, ఎమోషన్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయని.. ముఖ్యంగా క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్ అనే మాట వినిపిస్తోంది.

మొత్తానికి 'ది రాజా సాబ్'తో దర్శకుడు మారుతి అందరినీ సర్ ప్రైజ్ చేయడం ఖాయమనే అభిప్రాయం ఇండస్ట్రీ వర్గాల్లో ఉంది. మరికొద్ది గంటల్లో 'రాజా సాబ్'పై ఫ్యాన్స్, జనరల్ ఆడియన్స్ రెస్పాన్స్ కూడా తేలిపోనుంది.

రికార్డుల వేటలో మన శంకర వరప్రసాద్ గారు.. రెండు రోజుల కలెక్షన్స్ ఇవే 

సిల్వర్ స్క్రీన్ పై మనశంకరవరప్రసాద్ గారు(Mana Shankara Varaprasad Garu)వెంకీ గౌడ ల జులుం యధావిధిగా కొనసాగుతుంది. ఎనామనస్ గా అన్ని ఏరియాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తుండటంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కలకలలాడుతున్నాయి. దీంతో హిట్ కోసం ఎదురుచూస్తున్న చిరంజీవికి ఏకంగా బ్లాక్ బస్టర్ హిట్ దక్కినట్లయింది. కలెక్షన్స్ పరంగా కూడా చిరంజీవి కెరీర్ లోనే హయ్యస్ట్ నెంబర్ ని వసూలు చేసే అవకాశం ఉందని సినీ ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మరి ఇప్పటి వరకు  మన శంకర వర ప్రసాద్ రాబట్టిన కలెక్షన్స్ ని చూద్దాం.