English | Telugu
Anasuya Bharadwaj : బాలయ్య సినిమాలో అనసూయ.. రచ్చ రచ్చే!
Updated : Nov 8, 2023
నటసింహం నందమూరి బాలకృష్ణ తన 109వ సినిమాని బాబీ కొల్లి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ డ్రామా షూటింగ్ ఈరోజు(నవంబర్ 8) ప్రారంభమైంది. "బ్లడ్ బాత్ కా బ్రాండ్ నేమ్" అంటూ తాజాగా విడుదల చేసిన పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికర న్యూస్ వినిపిస్తోంది. అదేంటంటే ఈ మూవీలో అనసూయ ఓ పవర్ ఫుల్ పాత్ర పోషించనుందంట.
'NBK 109'లో యంగ్ బ్యూటీలు చాందినీ చౌదరి, ఊర్వశీ రౌతేలా ముఖ్య పాత్రలు పోషిస్తున్నట్లు ఇప్పటికే వార్తలొచ్చాయి. ఇప్పుడు ఆ లిస్టులో అనసూయ కూడా చేరింది. సినిమాకి కీలకమైన నెగటివ్ షేడ్స్ ఉన్న పవర్ ఫుల్ రోల్ అనసూయ నటించనుందట.
బుల్లితెర, వెండితెర అనే తేడా లేకుండా తనదైన మార్క్ చూపిస్తున్న అనసూయ.. 'క్షణం', 'రంగస్థలం', 'పుష్ప', 'విమానం' వంటి సినిమాలతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా 'పుష్ప'లో నెగటివ్ షేడ్స్ ఉన్న దాక్షాయణి పాత్రలో ఆమె నటన సర్ ప్రైజ్ చేసింది. అలాంటి అనసూయ ఇప్పుడు బాలయ్య సినిమాలో నెగటివ్ రోల్ చేయనుందనే వార్త ఆసక్తికరంగా మారింది. బాలయ్య, అనసూయ మధ్య పవర్ ఫుల్ సన్నివేశాలు ఉండి, ఇద్దరూ పోటాపోటీగా డైలాగ్ లు చెప్తే.. థియేటర్లలో విజిల్స్ మోతమోగడం ఖాయం.