English | Telugu

బాలయ్య కోసం హట్ యాంకర్ ప్రయత్నాలు

యాంకరింగ్ అంటే కేవలం ఒక షో ను తన మాటలతో మాత్రమే నడిపించడం ఒకటే కాదు... కుదిరిదే అందాల ప్రదర్శన చేసిన తప్పులేదనే తరహాలో యాంకరింగ్ చేస్తుంది హాట్ బ్యూటీ అనసూయ. పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకొని, ఐటెం సాంగ్ భామలు కూడా చూసి అసూయ పడే విధంగా గ్లామర్ ను పండించడంలో అనసూయ రెచ్చిపోతుంది. కేవలం ప్రత్యేక కార్యక్రమాలలో మాత్రమే కాకుండా సినిమాల్లో కూడా అవకాశాలు సంపాదించేందుకు అందాల ప్రదర్శన బాగా చేస్తుంది.

అయితే స్టేజ్ మీద యాంకరింగ్ చేయమంటే ఐటెం సాంగ్ భామకంటే ఎక్కువ గ్లామర్ ను ఒలకబోయడానికి సిద్ధమయ్యే హాట్ యాంకర్ అనసూయ మరో గోల్డెన్ ఛాన్స్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం బాలయ్య "లెజెండ్" సినిమా పాటల కోసం టాలీవుడ్ మొత్తం ఎదురుచూస్తుంటే... ఈ అమ్మడు మాత్రం ఈ షో ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని ఎదురుచూస్తుంది. ఎందుకంటే ఈ కార్యక్రమానికి యాంకరింగ్ చేసే అవకాశం ఈ అమ్మడికే దక్కిందట. సుమ, ఝాన్సీ, శిల్పా చక్రవర్తి, ఉదయభాను వంటి యాంకర్స్ ఉన్నప్పటికీ కూడా ఈ భామకే అవకాశం ఇచ్చారని తెలిసింది.

అయితే ఈ కార్యక్రమానికి చాలా మంది తెలుగు సినిమా పెద్దలు, స్టార్ దర్శకులు, నిర్మాతలు హాజరు కానున్నారు. అందుకే ఈ కార్యక్రమంలో తన మాటలతో మాత్రమే కాకుండా తన గ్లామర్ తో కూడా వారిని ఆకర్షించి ఎలాగైనా సినిమా అవకాశాలు దక్కించుకునే ఆలోచనలో ఉందట ఈ అమ్మడు. మరి ఈ అమ్మడి గ్లామర్ కు ఎంతమంది దర్శక,నిర్మాతలు సినిమా అవకాశాలు ఇస్తారో చూడాలి.

బాలయ్య "లెజెండ్" సినిమా పాటల విడుదల కార్యక్రమం ఈరోజు(మార్చి 7) సాయంత్రం శిల్పకళావేదికలోజరగనుంది. ఈరోజు ఉదయం ఈ సినిమా ఆడియో పోస్టర్ ను విడుదల చేసారు. ఈ చిత్రాన్ని మార్చి 28న లేదా ఏప్రిల్ 4న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

వారాహి చలన చిత్ర సాయి కొర్రపాటి సమర్పణలో, 14రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రాధికా ఆప్టే, సోనాల్ చౌహాన్ కథానాయికలు. జగపతి బాబు విలన్ పాత్రలో మొదటిసారిగా నటిస్తున్నాడు.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.