English | Telugu
మరోసారి శింబుతో రొమాన్స్ కు సిద్ధం
Updated : Mar 7, 2014
కన్నడలో తెరకెక్కుతున్న "దూకుడు" చిత్ర రీమేక్ లో పునీత్ రాజ్ కుమార్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసిన హీరోయిన్ త్రిష ప్రస్తుతం షూటింగ్ లో బిజీ అయిపొయింది. అయితే ఈ అమ్మడు నటించిన "విన్నైతాండి వరువయ" సినిమాలో శింబుతో కలిసి నటించి హిట్ పెయిర్ గా నిలిచింది. అయితే మరోసారి శింబుతో కలిసి రొమాన్స్ చేయడానికి సిద్ధమయింది త్రిష. సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న తాజా చిత్రంలో శింబు సరసన నటించనుంది. ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించనున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.