English | Telugu
మార్చి18 వరకు ఆటో విడుదల బంద్
Updated : Mar 7, 2014
నాగచైతన్య, సమంత జంటగా నటించిన "ఆటోనగర్ సూర్య"ను ఈనెల 9న విడుదల చేయబోతున్నట్లు దర్శక, నిర్మాతలు ప్రకటించారు. కానీ ఈ చిత్ర విడుదల అనుకున్న రోజున విడుదల కాకుండా దాదాపు మరో 20 రోజుల వరకు విడుదల కాకుండా అడ్డంకులు ఏర్పడ్డాయి.
ఈ సినిమా నిర్మాణ వ్యయంలో అబ్దుల్ అనే వ్యక్తి రెండు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టాడని ఆయన తరుపు న్యాయవాది శాంతా తెలిపారు. అయితే వీరు ముందుగా చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం సినిమా హక్కుల విషయంలో నిర్మాత సహకరించకపోవడంతో... నిర్మాత తనను మోసం చేశారని అబ్దుల్ కోర్టులో కేసు వేసారు. దాంతో ఈ సినిమా విడుదలను ఈనెల 18 వరకు నిలిపి వేయాలని గుంటూరు కోర్టు ఆదేశాలు జారీ చేయడమే కాకుండా, నిర్మాత అచ్చిరెడ్డిని కోర్టులో హాజరు కావాలని కోరింది. మరి ఈ ఆటో ఎప్పుడు జనాల ముందుకు వస్తుందో త్వరలోనే తెలియనున్నది. దేవకట్టా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి అనూప్ సంగీతాన్ని అందించాడు. ఇటీవలే విడుదలైన ఆడియోకు మంచి స్పందన వస్తుంది.