English | Telugu

మూడోసారి ఇళయరాజతో అమితాబ్


హిందీలో ఆర్.బాల్కి, అమితాబ్, ఇళయరాజ కాంబినేషన్‌లో వచ్చిన చీని కమ్, పా చిత్రాలు కమర్షియల్‌గా విజయం సాధించాయి.. వీరి కాంబినేషన్‌లో తాజాగా రూపొందుతున్న హిందీ చిత్రం 'షమితాబ్'. ఈ చిత్రంలో ఇళయరాజ సంగీత సారథ్యంలో మరోసారి అమితాబ్ పాట పాడబోతున్నారు. అమితాబ్ తన బ్లాగ్ ద్వారా ఈ విషయాన్ని పంచుకున్నారు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్‌ ఇళయరాజతో ఆయన గతంలో కూడా పని చేశారు. పా, చీని కమ్ చిత్రాలకు కూడా అమితాబ్ గాత్ర దానం చేశారు.


ఈ చిత్రంలో జాతీయ అవార్డు గ్రహీత, తమిళ నటుడు ధనుష్ కూడా ఒక ప్రముఖ పాత్రలో నటిస్తున్నాడు. కమల్ హాసన్ రెండో కూతురు అక్షర మొదటి సారి తెర మీద కనిపించనుండటం ఈ చిత్రానికి సంబందించిన మరో ప్రత్యేకత. ప్లే బ్యాక్ సింగర్‌గా అమితాబ్ గతంలో కూడా చాలా హిట్ పాటలు పాడిన సంగతి తెలిసిందే.



టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.