English | Telugu

'అశ్వ‌త్థామ‌'గా అల్లు అర్జున్.. భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్!

టాలీవుడ్ స్టార్ హీరోలపై బాలీవుడ్ చూపు పడింది. బాలీవుడ్ నుంచి పలు భారీ ఆఫర్లు మన తెలుగు హీరోలను వెతుక్కుంటూ వస్తున్నాయి. ఇప్పటికే ప్రభాస్ 'ఆదిపురుష్' అనే భారీ మైథలాజికల్ ఫిల్మ్ లో నటించాడు. ఈ సినిమా జూన్ 16 న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఇండియాస్ బిగ్గెస్ట్ స్పై యూనివర్స్ లో భాగంగా రూపొందనున్న 'వార్-2' లో నటించనున్నాడు. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ వంతు వచ్చింది.

'ఉరి' ఫేమ్ ఆదిత్య ధ‌ర్ దర్శకత్వంలో 'ది ఇమ్మోర్ట‌ల్స్ అశ్వ‌త్థామ‌' అనే భారీ మైథలాజికల్ ఫిల్మ్ రూపొందనుంది. మొదట విక్కీ కౌశల్ హీరోగా రోనీ స్క్రూవాలా ఈ ప్రాజెక్ట్ ని నిర్మించాలి అనుకున్నారు. కానీ ఆ తర్వాత జియో స్టూడియోస్ రంగంలోకి దిగింది. ఇక హీరోగా విక్కీ కౌశల్ కి బదులుగా రణ్ వీర్ సింగ్ నటించే అవకాశముందని న్యూస్ వినిపించింది. అయితే ఇటీవల టాలీవుడ్ స్టార్లు ఎన్టీఆర్, అల్లు అర్జున్ పేర్లు కూడా వినిపించాయి. ఇక ఇప్పుడు బన్నీ పేరు దాదాపు ఖరారైందని తెలుస్తోంది.

'పుష్ప'తో అల్లు అర్జున్ పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఆయన నటిస్తున్న 'పుష్ప-2' కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు బన్నీతో సినిమా చేస్తే సౌత్, నార్త్ అనే తేడా లేకుండా పాన్ ఇండియా రీచ్ ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకునే తాజాగా 'అశ్వ‌త్థామ‌' మేకర్స్ బన్నీని కలిశారట. అశ్వ‌త్థామ‌గా నటించడానికి బన్నీ ఆసక్తిగానే ఉన్నప్పటికీ, ఇంకా ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. అయితే ఈ ప్రాజెక్ట్ కి ఆయన ఓకే చెప్పే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు. అన్నీ అనుకున్నట్టుగా జరిగి అశ్వ‌త్థామ‌గా నటించడానికి బన్నీ ఓకే చెప్తే.. ప్రకటనతోనే ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు ఓ రేంజ్ కి వెళ్తాయి అనడంలో సందేహం లేదు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .