English | Telugu

చక్రి భార్య శ్రావణికి ప్రాణహాని వుందా?

చక్రి కుటుంబసభ్యుల నుంచి ప్రాణహాని వుందని, అందుకే తాను మానవ హక్కుల కమిషన్‌ని ఆశ్రయించానని చక్రి భార్య శ్రావణి మీడియాకు తెలియజేశారు. చక్రి తల్లిదండ్రులు, అక్కా చెల్లెళ్ళు తనను హింసించారని, ఆస్తికోసం వేధిస్తున్నారని చక్రి భార్య శ్రావణి మానవ హక్కుల కమిషన్‌కి ఫిర్యాదు చేశారు. అలాగే చక్రి మరణించిన వారి కుటుంబసభ్యులు ప్రవరిస్తున్న తీరు తనకు భయాన్ని కలిగించాయని ఆమె తెలిపారు. చక్రి ఆరోగ్యం విషమంగా ఉన్నవిషయాన్ని చెప్పడానికి తాను ఆయన కుటుంబ సభ్యులకు ఫోన్ చేస్తే ఎవరూ కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదని ఆమె తెలిపారు. దాంతో తాను కనీసం కాళ్ళకు చెప్పులు కూడా వేసుకోకుండా అంబులెన్స్‌లో చక్రిని ఆస్పత్రికి తీసుకెళ్ళానని అన్నారు. చక్రి చనిపోయిన తర్వాత చక్రి చనిపోయాడన్న బాధ కంటే చక్రి ఆస్తి మీద ఆసక్తి వారిలో ఎక్కువగా కనిపించింది. నేను బాధతో రోదిస్తుంటే చక్రి తరఫు బంధువులెవరూ నన్ను ఓదార్చే ప్రయత్నం కూడా చేయలేదు. కనీసం మంచినీళ్ళు అయినా తాగానా లేదా అని కూడా పట్టించుకోలేదు. ఆయన కర్మకాండలు పూర్తి కాకముందే ఆస్తికోసం వీళ్ళ వేధింపులు ఎక్కువయ్యాయి అని ఆమె తెలిపారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.