English | Telugu
Allu Arjun : పాయల్ 'మంగళవారం' కోసం అల్లు అర్జున్!
Updated : Nov 7, 2023
పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'మంగళవారం'. ముద్ర మీడియా వర్క్స్, ఏ క్రియేటివ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ హారర్ థ్రిల్లర్ నవంబర్ 17న రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టిస్తుందనే అంచనాలున్నాయి. ఇక ఇప్పుడు ఈ సినిమాని ప్రేక్షకులకు మరింత చేరువ చేయడం కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రంగంలోకి దిగుతుండటం విశేషం.
చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయడంలో అల్లు అర్జున్ ఎప్పుడూ ముందుంటాడు. త్వరలో జరగనున్న 'మంగళవారం' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా ముఖ్య అతిథిగా రావడానికి ఆయన అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ చిత్ర నిర్మాత స్వాతి రెడ్డితో బన్నీ కుటుంబానికి మంచి అనుబంధముందట. పైగా ట్రైలర్ చూసి ఫిదా అయిన బన్నీ.. ఇప్పటికే చిత్ర బృందాన్ని ప్రత్యేకంగా అభినందించాడట. ఇక ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా రావడానికి ఓకే చెప్పినట్లు సమాచారం. నవంబర్ 11న హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ లో ఈ వేడుకను నిర్వహించడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.