English | Telugu
తండ్రి కాబోతున్న శర్వానంద్
Updated : Nov 7, 2023
తెలుగు సినిమా పరిశ్రమకి దొరికిన ఒక మంచి నటుడు శర్వానంద్. శర్వానంద్ ఇప్పటివరకు 30 చిత్రాలకి పైగానే చేసాడు. సినిమా సినిమాకి వైవిధ్యమైన క్యారెక్టర్లని ఎంచుకుంటు తనకంటు సొంతంగా అభిమానులని కూడా సంపాదించుకున్నాడు. ఇప్పుడు శర్వానంద్ కి సంబంధించిన ఒక వార్త ఆయన అభిమానులని ఆనందంలో ముంచెత్తుతుంది.
శర్వానంద్ కి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన రక్షితా రెడ్డి తో వివాహం జరిగిన విషయం అందరికి తెలిసిందే. ఇప్పుడు రక్షితా ప్రెగ్నెన్సీ అయ్యిందనే వార్తలు వినపడుతున్నాయి. అయితే రక్షితా ప్రెగ్నెన్సీ విషయంలో మాత్రం శర్వానంద్ కాంపౌండ్ నుంచి అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. శర్వానంద్ ప్రస్తుతం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్నాడు. కృతి శెట్టి హీరోయిన్ గా చేస్తుంది. శర్వానంద్ నుంచి వచ్చిన ఆఖరి సినిమా ఒకే ఒక జీవితం.