English | Telugu

బన్నీ పుట్టినరోజు కానుక

టాలీవుడ్ లో తనకంటూ ఓ బ్రాండ్ ను సొంతం చేసుకొని, అభిమానుల గుండెల్లో టాలీవుడ్ స్టైలిష్ స్టార్ గా పేరు దక్కించుకున్న ఏకైక నటుడు అల్లు అర్జున్. అందరూ "బన్నీ" అని ముద్దుగా పిలుచుకుంటారు. నేడు బన్నీ పుట్టినరోజు.

బన్నీ ఏప్రిల్ 8న జన్మించాడు. మొదటి నుండి బన్నీకి డాన్స్ అంటే చాలా ఇష్టం. చిరంజీవి నటించిన "డాడీ" సినిమాలోని ఓ చిన్న బిట్ కు డాన్స్ చేసి అందరి మన్ననలు పొందాడు. ఆ తరువాత రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన "గంగోత్రి" చిత్రం ద్వారా వెండితెరకు హీరోగా పరిచయం అయ్యాడు. తన రెండవ సినిమా "ఆర్య" బ్లాక్ బస్టర్ హిట్టవడంతో బన్నీ స్టైలిష్ స్టార్ అయిపోయాడు. ఆ తరువాత బన్నీ నటించిన దాదాపు అన్ని చిత్రాలు కూడా మంచి విజయాన్ని సాధించాయి.

ఇటీవలే తనకు కొడుకు పుట్టాడు. ఇదే అభిమానులకు పెద్ద పండగ అనుకుంటే ఈరోజు అతని పుట్టినరోజు. అలాగే ఈనెల 11న బన్నీ నటించిన "రేసుగుర్రం" సినిమా విడుదల కాబోతుంది. ఇలా వరుసగా అన్ని సంతోషకర విషయాలతో అటు కుటుంబ సభ్యులు, ఇటు అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు.

ఇలాగే తన సినిమాలతో ప్రేక్షకులను అలరించాలని కోరుకుంటూ.. మరోసారి బన్నీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది తెలుగువన్.కామ్

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.