English | Telugu

AA22 : అట్లీతో అల్లు అర్జున్.. త్రివిక్రమ్ వేరే హీరోని చూసుకున్నాడా..?

'పుష్ప-2'తో సంచలన విజయాన్ని అందుకున్న అల్లు అర్జున్ (Allu Arjun) తన తదుపరి సినిమాని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయాల్సి ఉంది. కానీ ఈ సినిమా ప్లేస్ లోకి అనూహ్యంగా కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ ప్రాజెక్ట్ వచ్చింది. సన్ పిక్చర్స్ నిర్మించనున్న ఈ బిగ్ బడ్జెట్ యాక్షన్ ఫిల్మ్ షూట్ ను బన్నీ త్వరలో ప్రారంభించనున్నాడు. దీంతో త్రివిక్రమ్ సినిమా సంగతి ఏంటి? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. (AA22)

అల్లు అర్జున్, త్రివిక్రమ్ ది హిట్ కాంబినేషన్. వీరి కాంబినేషన్ లో 'జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి', 'అల వైకుంఠపురములో' సినిమాలు వచ్చాయి. 2023 జులైలో వీరి కాంబోలో నాలుగో సినిమా ప్రకటన వచ్చింది. 'పుష్ప-2' తర్వాత బన్నీ చేయబోయే సినిమా ఇదేనని అందరూ ఫిక్స్ అయ్యారు. కానీ, అనుకోకుండా అట్లీ మూవీ తెరపైకి వచ్చింది. దీంతో ఏడాదికి పైగా అల్లు అర్జున్ సినిమా కోసం ఎదురుచూస్తున్న త్రివిక్రమ్ ఏం చేస్తాడు? మరికొంత కాలం ఎదురుచూస్తాడా? లేక వేరే ప్రాజెక్ట్ కి షిఫ్ట్ అవుతాడా? అనే చర్చలు జరుగుతున్నాయి. త్రివిక్రమ్ వేరే హీరోతో సినిమా చేసే అవకాశముందన్న ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. అయితే అందులో వాస్తవం లేదని తెలుస్తోంది.

బన్నీ, త్రివిక్రమ్ కాంబోలో అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్ అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న మైథలాజికల్ ఫిల్మ్. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కే చాలా సమయం పడుతుంది. పక్కా ప్లానింగ్ తో షూట్ కి వెళ్లాలనే ఆలోచనలో టీం ఉందట. త్రివిక్రమ్ కూడా స్క్రిప్ట్ మీద వీలైనంత ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారట. కొద్ది నెలలు ఆలస్యంగా షూట్ స్టార్ట్ అయినా.. షూట్ తక్కువ టైంలోనే పూర్తి చేసేలా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వెళ్తున్నారట. ఆ తర్వాత మళ్ళీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి ఎక్కువ సమయం తీసుకోనున్నారని సమాచారం.

ఇండస్ట్రీ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట ప్రకారం.. త్రివిక్రమ్ మరో ప్రాజెక్ట్ కి షిఫ్ట్ కానున్నారనే వార్తల్లో నిజం లేదు. ప్రస్తుతం ఆయన తన పూర్తి ఫోకస్ ని అల్లు అర్జున్ సినిమాపైనే పెడుతున్నారు. త్రివిక్రమ్ కి పురాణాలపై పట్టు ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బన్నీతో చేయనున్న ఈ మైథలాజికల్ ఫిల్మ్ తో పాన్ ఇండియా వైడ్ గా సత్తా చాటాలని త్రివిక్రమ్ భావిస్తున్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.