English | Telugu

అక్కని టెన్షన్ పెడుతున్న చెల్లెలు

కమల్ హాసన్ పెద్ద కూతురు శ్రుతి హాసన్ ఇటు దక్షిణాదిలో, అటు ఉత్తరాదిలో ఇరగదీస్తోంది. ఇప్పుడు కమల్ మరో కూతురు అక్షర హాసన్ త్వరలో విడుదల కాబోతున్న హిందీ సినిమా ‘షమితాబ్’లో నటించింది. ధనుష్ హీరోగా నటించిన ఆ సినిమాలో అమితాబ్ కూడా నటించాడు. ఈ సినిమాతో తాను బాలీవుడ్‌లో సెటిలైపోవడం ఖాయమని అక్షర భావిస్తోంది. తన అక్కలాగా దక్షిణాదికి, ఉత్తరాదికి షటిల్ సర్వీసు చేయాల్సిన అవసరం లేదని అనుకుంటోందని సమాచారం. ఇదిలా వుంటే, గతంలో రైటర్‌గా, అసిస్టెంట్ డైరెక్టర్‌గా వున్న సమయంలో పప్పు సుద్దలా వుంటే అక్షర హాసన్ ఈమధ్య బాగా గ్లామర్ పెంచేసింది. మొన్నీమధ్య ‘షమితాబ్’ సినిమాకి సంబంధించిన ఒక కార్యక్రమానికి హాజరైన అక్షరని చూసి బాలీవుడ్ వాళ్ళంతా నోళ్ళు తెరిచారు. ఈ పిల్లలో ఇంత గ్లామరుందా అని ఆశ్చర్యపోయారు. ఇదంతా చూసిన కొంతమంది శ్రుతి హాసన్ కి గట్టి పోటీ ఖాయమంటున్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.