English | Telugu

హీరోయిన్ తేలుతుందా?

హీరోయిన్ తేలుతుందా అంటే ఎవరో హీరోయిన్ మునిగిపోయిందని అనుకోవద్దు ప్లీజ్. హీరోయిన్ తేలడం అంటే.. అఖిల్ హీరోగా నటిస్తున్న సినిమా హీరోయిన్ ఎవరు అనే విషయం ఎప్పుడు తేలుతుందా అనేది కవి హృదయం. అఖిల్ హీరోగా, వినాయక్ డైరెక్షన్లో భారీ బడ్జెట్‌తో హీరో నితిన్ నిర్మిస్తున్న భారీ సినిమా షూటింగ్ ఈమధ్య లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ముహూర్తం బాగుందని షూటింగ్ మొదలెట్టేశారు. అయితే ఈ సినిమాలో అఖిల్ సరసన యాక్ట్ చేసే హీరోయిన్ ఎవరన్న విషయం మాత్రం ఇంతవరకు కన్ఫమ్ కాలేదట. అందుకే కొబ్బరికాయ కొట్టి చాలా రోజులైనా ఇంతవరకు క్లాప్ కొట్టలేదట. అఖిల్ పక్కన హీరోయిన్ అంటే ఆషామాషీగా, సాదాసీదాగా వుంటే కుదురుతుందా.. కుదరదు గాక కుదరదు. అందంలో అఖిల్‌తో పోటీ పడే విధంగా వుండాలి. అలాంటి హీరోయిన్ కోసమే దర్శకుడు వినాయక్ భూతద్దం పట్టుకుని వెతుకుతున్నా ఇప్పటి వరకూ ఆ అన్వేషణ ఓ కొలిక్కి వచ్చినట్టు అనిపించడం లేదట. ఇప్పటి వరకూ అలియాభట్, సునీల్ శెట్టి కూతురు ఆద్య, శ్రీదేవి కూతురు జాన్వీ, రాశీఖన్నా, అమిరా దస్తర్... ఇలా చాలామంది ముద్దుగుమ్మల గురించి ఆలోచించారట. ఆద్యతో అయితే ఫొటో షూట్ కూడా చేశారట. అయినప్పటికీ అఖిల్ సరసన ఎవరూ అప్ టు మార్క్ అనిపించలేదట. మరి ఈ సినిమా హీరోయిన్ విషయం ఎప్పుడు తేలుతుందో.. ఎప్పుడు రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందో....

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.