English | Telugu

తెలంగాణాలో అఖండ 2 టికెట్ రేట్స్ ఇవేనా!


-తెలంగాణాలో టికెట్ రేట్స్ ఎలా ఉండబోతున్నాయి
-ఏపి లో ఎంత పెరిగాయి.
-అభిమానుల పూజలు

రెండు తెలుగు రాష్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా ఉన్న బాలయ్య(Balakrishna)అభిమానులు, మూవీ లవర్స్ లో అఖండ 2(Akhnada 2)సందడి వాతావరణం నెలలోని ఉంది. ఇప్పటికే చాలా థియేటర్స్ బాలయ్య కట్ అవుట్స్ తో ముస్తాబయ్యాయి. మూవీ హిట్ కావాలని అభిమానులు గుళ్ళల్లో, మసీదుల్లో, చర్చిల్లో ప్రార్ధనలు కూడా చేస్తున్నారు. ఇండస్ట్రీ వర్గాలతో పాటు సెన్సార్ వాళ్ళ నుంచి అయితే పాజిటివ్ టాక్ వినపడుతుంది.

రీసెంట్ గా అఖండ 2 టికెట్ రేట్స్ పెంచుకోవడానికి ఏపి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. డిసెంబర్ 4న రాత్రి 8 నుండి 10 గంటల ప్రాంతంలో ప్రీమియర్ షో ప్రదర్శనకి అనుమతి ఇవ్వడంతో పాటు టికెట్ ధరని 600 గా నిర్ణయించారు. అదే విధంగా పదిరోజుల పాటు టికెట్ ధరల పెంపుకి అనుమతి లభించింది. మల్టీప్లెక్స్ లలో 100, సింగిల్ స్క్రీన్స్ లో 75 పెంపుకి పర్మిషన్ ఇచ్చారు. కానీ తెలంగాణలో టికెట్ రేట్స్ ఎలా ఉండబోతున్నాయో బెనిఫిట్ షో ల గురించి ఇంకా ఎలాంటి ప్రకటన లేదు. పుష్ప 2 తొక్కిసలాట సంఘటన జరిగిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బెనిఫిట్ షోస్ కి అనుమతి ఇవ్వమని, టికెట్ రేట్స్ పెంచుకోవడానికి కూడా అనుమతి ఇవ్వమని చెప్పారు. కానీ ఆ తర్వాత పెద్ద సినిమాలకి భారీగా ఖర్చు అవుతుండటంతో మేకర్స్ కోరిన అనుమతులు ఇస్తూ వస్తున్నారు.

also Read: రాజ్ మొదటి భార్య శ్యామాలి కీలక నిర్ణయం.. విశ్వంతో జవాబు


ఈ నేపథ్యంలో తెలంగాణకి సంబంధించి టికెట్ రేట్స్ ఎలా ఉండబోతున్నాయనే ఆసక్తి అందరిలో ఉంది. సినీ ట్రేడ్ వర్గాల వారైతే సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు ఆంధ్ర ప్రదేశ్ లో ఏ విధంగా అయితే రేట్స్ ఉన్నాయో అదే విధంగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు.బెనిఫిట్ షో న్యూస్ కోసం అయితే అభిమానులు ఫుల్ వెయిటింగ్. బుక్ మై షో తో పాటు ఇతర ఆన్ లైన్స్ యాప్ లని అయితే ప్రతి నిమిషానికి ఒకసారి సెర్చ్ చేస్తున్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .