English | Telugu

అఖండ 2 ఫస్ట్ రివ్యూ ఇదే!

-ఏముంది ఫస్ట్ రివ్యూలో!
-ఇచ్చింది ఎవరు
-ఉమైర్ సింధు చెప్పేది నిజమేనా!
-అభిమానుల రియాక్షన్ ఏంటి!
-సెకండ్ హాఫ్ కీలకమా!


అసేతు హిమాచలం సాక్షిగా గాడ్ ఆఫ్ మాసెస్ పద్మభూషణ్ 'బాలకృష్ణ'(Balakrishna)ఈ రోజు నైట్ అఖండ 2(Akhanda 2)తో సిల్వర్ స్క్రీన్ పై కాలు మోపనున్నాడు. అఖండ కి సీక్వెల్ కావడం, పైగా అణు విస్ఫోటనం లాంటి బాలయ్య, బోయపాటి(Boyapati Srinu)కాంబో కావడంతో మూవీ ఏ స్థాయిలో తన విస్ఫోటనాన్ని చూపిస్తుందనే ఆసక్తి అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో ఉంది. ఇక ప్రీమియర్స్ కి కౌంట్ డౌన్ ప్రారంభం కావడంతో అభిమానుల్లో మూవీ రిజల్ట్ పై చిన్న పాటి టెన్షన్ కూడా మొదలైంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో అఖండ 2 ఫస్ట్ రివ్యూ ఇదే అని ఒక న్యూస్ హల్ చల్ చేస్తుంది. మరి సదరు రివ్యూ ఎవరు ఇచ్చారు?ఏమని ఉందో చూద్దాం.


ఉమైర్ సంధు(Umair Sandhu)..దుబాయ్ సెన్సార్ బోర్డ్ సభ్యుడుతో పాటు ఒక మూవీ ప్రేక్షకులని మెప్పిస్తుందా లేదా అని నిష్పక్షపాతంగా తన అభిప్రాయాన్ని వెల్లడి చేసే క్రిటిక్ కూడా. అందుకే ఉమైర్ చెప్పే రివ్యూస్ కి మంచి క్రేజ్ ఉండటంతో పాటు చాలా మంది నమ్ముతారు రీసెంట్ గా ఉమైర్ ‘అఖండ 2’ పై ఎక్స్ వేదికగా స్పందిస్తు అఖండ 2 పూర్తిగా పైసా వసూల్ సినిమా. అదిరిపోయే డైలాగ్స్, యాక్షన్ సీన్స్ ఉన్నాయి. బాలకృష్ణ డై హార్డ్ ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పిస్తుంది. వాళ్ళ ఆకలి తీరడం ఖాయమని 'ఎక్స్' వేదికగా ట్వీట్ చేసాడు. ఉమైర్ ఇచ్చిన రివ్యూనే కాకుండా సెన్సార్ ఇచ్చిన రిపోర్ట్ అని మరో రివ్యూ కూడా హల్ చేస్తుంది.

also read: ఎంతగానో చింతిస్తున్నాను.. పవన్ కళ్యాణ్ అధికార లేఖ విడుదల

అఘోర ఎంట్రీ ఒక లెవల్ లో ఉంది. పక్కా మాస్ ఎంటర్‌టైనర్. ఫస్టాఫ్ లో భారీ యాక్షన్ సీన్స్ ఉన్నాయి. ఇంటర్వెల్ ఎపిసోడ్ తో పాటు సెకండాఫ్‌ ప్రధాన బలం.ప్రీ క్లైమాక్స్ ఎమోషనల్‌గా అందరికీ కనెక్ట్ అవుతుంది. హనుమా‌న్‌ ఎంట్రీ సీన్స్ మైండ్‌ బ్లోయింగ్‌ అని చెప్పినట్టుగా కూడా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇక అఖండ 2 కి సెన్సార్‌ యూ/ ఏ సర్టిఫికేట్‌ ఇవ్వగా 2 గంటల 45 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు రానుంది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.