English | Telugu
'గుంటూరు కారం' ఫస్ట్ సాంగ్.. ఇక రచ్చ రచ్చే!
Updated : Nov 1, 2023
'గుంటూరు కారం' ఫస్ట్ సింగిల్ కోసం మహేష్ బాబు ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లోనే విడుదలవుతుందని మొదట్లో ప్రచారం జరిగింది. కానీ రిలీజ్ కాలేదు. ఆ తర్వాత దసరాకు(అక్టోబర్ లో) విడుదల చేస్తామని నిర్మాత నాగవంశీ అన్నారు. దసరా కూడా అయిపోయింది కానీ ఫస్ట్ సింగిల్ రాలేదు. దీంతో అసలు గుంటూరు కారం మొదటి సాంగ్ ఎప్పుడొస్తుందని అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో వారికో శుభవార్త వచ్చింది.
తాజాగా జరిగిన 'ఆదికేశవ' మూవీ ప్రెస్ మీట్ లో 'గుంటూరు కారం' ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు నిర్మాత నాగవంశీ. "భారీ అంచనాలు ఉండటంతో, మెరుగైన అవుట్ పుట్ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే.. లిరికల్ వీడియో ఆలస్యమవుతోంది. నవంబర్ మొదటి వారంలో గుంటూరు కారం ఫస్ట్ సాంగ్ ఖచ్చితంగా విడుదలవుతుంది." అన్నారు.
'అతడు', 'ఖలేజా' తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం 'గుంటూరు కారం'. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా 2024, జనవరి 12న విడుదల కానుంది.