English | Telugu

ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ఓటీటీలోకి అఖిల్ 'ఏజెంట్'!

ఈమధ్య జయాపజయాలతో సంబంధం లేకుండా మెజారిటీ సినిమాలు థియేటర్లలో విడుదలైన నాలుగు వారాలకే ఓటీటీలో దర్శనమిస్తున్నాయి. కానీ 'ఏజెంట్' మాత్రం థియేటర్లలో విడుదలై ఐదు నెలలు అవుతున్నా, ఇంతవరకు ఓటీటీలోకి రాలేదు. అసలు ఈ సినిమా ఓటీటీలో విడుదలవుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఎట్టకేలకు ఈ సినిమా ఓటీటీ విడుదలకు ముహూర్తం ఖరారైంది.

అక్కినేని అఖిల్, మమ్ముట్టి, సాక్షి వైద్యా ప్రధాన పాత్రల్లో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన సినిమా 'ఏజెంట్'. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్‌ 28న థియేటర్లలో విడుదలై పరాజయం పాలైంది. అయినప్పటికీ థియేటర్లలో మిస్ అయినవారు.. ఈ సినిమాని ఓటీటీలో చూడటానికి బాగానే ఆసక్తి చూపారు. కానీ ఏవో కారణాల వల్ల ఓటీటీ విడుదల ఆలస్యమవుతూ వచ్చింది. నెలలు గడిచిపోవడంతో ఈమధ్య అసలు ఆ సినిమా ఊసే లేదు. దాదాపు అందరూ మర్చిపోతున్న సమయంలో సడెన్ గా 'ఏజెంట్' ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటన వచ్చింది. ఈ సినిమాని సెప్టెంబర్ 29 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు తాజాగా సోనీ లివ్ ప్రకటించింది. మరి ఇంత ఆలస్యంగా ఓటీటీ ఎంట్రీ ఇస్తున్న ఏజెంట్ కి ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాలి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.