English | Telugu

'ఆదిపురుష్' ట్రైలర్ కి ముహూర్తం ఫిక్స్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ శ్రీరామునిగా కనువిందు చేయనున్న మైథలాజికల్ ఫిల్మ్ 'ఆదిపురుష్'. ఓం రౌత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సీతగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. అత్యంత భారీ బడ్జెట్ తో టి.సిరీస్ బ్యానర్‌ లో రూపొందుతోన్న ఈ మూవీ జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే ఈ మూవీ ట్రైలర్ విడుదలకు ముహూర్తం ఖరారైందని తెలుస్తోంది.

నిజానికి ఆదిపురుష్ చిత్రాన్ని ఈ ఏడాది సంక్రాంతికే విడుదల చేయాలని మొదట సన్నాహాలు చేశారు. అయితే గతేడాది అక్టోబర్ లో విడుదల చేసిన టీజర్ అంచనాలకు అందుకోకపోవడంతో.. వీఎఫ్ఎక్స్ కోసం మరింత సమయం తీసుకోవాలని భావించిన మేకర్స్ చిత్ర విడుదలను జూన్ కి వాయిదా వేశారు. ఈ క్రమంలో ఈ మూవీ ట్రైలర్ ఎలా ఉంటుందోనన్న ఆసక్తి అందరిలో నెలకొంది. అయితే త్వరలోనే ఆ సస్పెన్స్ కి తెరపడనుంది.

'ఆదిపురుష్' ట్రైలర్ ని మే 9న విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. అంతేకాకుండా ముందురోజున దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన కొన్ని థియేటర్లలో ట్రైలర్ ను ప్రదర్శించనున్నారని వినికిడి. అప్పటికీ ఇప్పటికీ వీఎఫ్ఎక్స్ మెరుగుపడిందని, ట్రైలర్ అందరి అంచనాలకు మించేలా ఉంటుందని ఇన్ సైడ్ వర్గాలు అంటున్నాయి. మరి 'ఆదిపురుష్' ట్రైలర్ ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.